Sugar Free Diet Plan : బరువు తగ్గడానికి, ఆరోగ్యం కోసం చాలామంది ఎవరి సజెషన్స్ లేకుండానే షుగర్స్​ని తమ డైట్​ నుంచి తీసేస్తున్నారు. ఏది తినాలన్నా వామ్మో షుగర్స్ ఉన్నాయంటూ.. అయ్యే నేను స్వీట్స్ తినడం మానేశాను అంటూ చెప్తున్నారు. అయితే ఇలా షుగర్స్ సడెన్​గా మానేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? స్వీట్స్, షుగర్స్ మానేయడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

షుగర్స్ మానేయడం అనేది ఆరోగ్యానికి తీసుకునే అతి ఉత్తమమైన నిర్ణయాల్లో ఒకటి. అయితే ఇలా స్వీట్స్ మానేయడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదు. అలాగే షుగర్స్ మానేయడం వల్ల వచ్చే ఇబ్బందులను ఎలా తట్టుకోవాలో.. షుగర్స్​కి ప్రత్యామ్నాయంగా ఏవి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

స్వీట్స్ మాత్రమే కాదు.. 

షుగర్స్ అంటే చాలామంది స్వీట్స్​ అనే అనుకుంటారు. వాటిని తినడం మానేస్తారు. కానీ చాలా ఫుడ్స్​లో షుగర్స్ ఉంటాయి. కెచప్, పాస్తా సాస్ వంటి వాటిలో కూడా షుగర్ ఉంటుంది. సలాడ్ డ్రెస్సింగ్స్​, ఫ్లేవర్డ్ యోగర్ట్స్​లలో కూడా షుగర్స్ ఉంటాయి. హెల్తీ అనుకుని చాలామంది ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​లో సెరెల్స్ తీసుకుంటారు. వీటిలో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది. బ్రెడ్స్​లో కూడా షుగర్ ఉంటుంది. 

డ్రింక్స్ 

చాలా డ్రింక్స్ షుగర్స్​తో నిండి ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్​లు, ఫ్లేవర్డ్ కాఫీ, ఇతర ఎనర్జి డ్రింక్​ల్లో షుగర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, ఇన్​ఫ్యూజ్ చేసిన నీటిని తీసుకోవచ్చు. 

షుగర్స్ మానేస్తే.. 

షుగర్స్, స్వీట్స్ తీసుకోవడం మానేస్తే ఆరోగ్యానికి లాభమే. కానీ కొత్తలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. తలనొప్పి తరచూ రావడం, మూడ్ స్వింగ్స్ పెరగడం జరుగుతాయి. ఇరిటేషన్, ఫటిగో, ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. మీరు షుగర్స్​ని పూర్తి స్థాయిలో మానేసిన 3 నుంచి 10 రోజులు ఈ సమస్యలు కనిపిస్తూనే ఉంటాయి. 

రీసెట్.. 

షుగర్స్ తీసుకోవడం మానేసిన 1 లేదా 2 వారాల తర్వాత సహజంగా షుగర్స్ క్రేవింగ్స్ పెరుగుతాయి. ఆ సమయంలో పండ్లు, కూరగాయలు కూడా తియ్యని రుచిని ఇస్తాయి. టేస్ట్ బడ్స్ రీసెట్ సమయమిది. 

ఆరోగ్యం 

షుగర్స్ మానేయడం వల్ల ఎనర్జిటిక్​గా ఉంటారు. మూడ్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గడంలో, ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. టైప్ 2 డయాబెటిస్ సమస్యలు తగ్గుతాయి. గుండె సమస్యలు, ఫ్యాటీ లివర్ ఇబ్బందులు ఉండవు. చర్మం క్లియర్​గా మారుతుంది. మొటిమలు తగ్గుతాయి. 

ప్రత్యామ్నాయాలు

షుగర్స్ తీసుకోవడం మానేసిన తర్వాత క్రేవింగ్స్ వస్తే.. మీరు కొన్ని ప్రత్యామ్నాయలు ఫాలో అవ్వవచ్చు. తాజా పండ్లు స్వీట్​గా ఉండి మంచి రుచిని ఇస్తాయి. ఖర్జూరాలు, అంజీర్ వంటివి తీసుకోవచ్చు. స్టీవియా, మాంక్ ఫ్రూట్ వంటివాటిలో కూడా షుగర్ ఫ్రీ స్వీటనర్స్ ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ తగ్గుతాయి. 

మానసిక ఆరోగ్యం 

షుగర్స్ మానేయడం అనేది కేవలం శరీరానికే కాదు.. మైండ్​ మెరుగుదలకి కూడా మంచిది. బ్రెయిన్ ఫాగ్, మందగించడం, జ్ఞాపకశక్తిలో మార్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి షుగర్స్​ని కంట్రోల్ చేస్తూ ప్రోగస్​ని ట్రాక్ చేస్తూ ఉండాలి. 

షుగర్స్ మానేయాలనుకున్నప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుంటే మీ బ్రెయిన్​ని కంట్రోల్ చేసుకోవచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం మీరు కూడా షుగర్​ని కట్ చేస్తే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.