మనలో ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది. మనం దానిలో కూరగాయలు, పండ్లు ఇంకా ఇతర ఆహార పదార్ధాలను నిల్వ చేస్తుంటాము. పాల దగ్గర నుంచి పెరుగు వరకు ఫ్రిజ్ లో పెడతాము. అయితే, మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇలా నిల్వ ఉంచే ఫుడ్స్ మీ ఆరోగ్యానికి మంచివా, కదా అనే విషయంపై అవగాహన ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల వాటి రుచి మొత్తం మారిపోతుంది. అలాగే న్యూట్రీషన్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మీరు ముందు ఫ్రిడ్జ్ లో ఏ పదార్థాలు పెట్టాలి, ఎలాంటి ఆహాారాలు ఉంచకూడదో తెలుసుకోవాలి. అన్ని ఆహారాలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదని గుర్తు పెట్టుకోండి. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాంటి ఆహారాలను ఫ్రిజ్ లో నిల్వ చేస్తే, అవి విషపూరితం అవుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.. 


అన్నం: ఇంట్లో రోజూ అన్నం వండుకుంటాము. ఒక్కోసారి తెలియకుండా కొంచెం ఎక్కువ కుక్ చేస్తుంటాం. అలాంటి సమయంలో కొంతమంది వండిన అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టడం చేస్తుంటారు. మరికొంత మంది బిర్యానీ మిగిలి ఉంటే, వెంటనే రిఫ్రిజిరేటర్ నిల్వ చేస్తారు. అయితే, వైద్యులు అన్నం వేడిగా ఉన్నప్పుడే తినేయాలని చెబుతున్నారు. రిఫ్రిజిరేటెడ్ రైస్ 24 గంటల తర్వాత విషపూరితంగా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


వెల్లుల్లి: చాలా మంది వెల్లుల్లిని పొట్టు తీసి భద్రపరుస్తారు. ఇది తీయడానికి చాలా సమయం పడుతుంది. పొట్టు నుంచి వెల్లుల్లి రెబ్బలను వేరు చేస్తారు. ఇలా ఒలిచిన వెల్లుల్లి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం ఏ మాత్రం మంచిది కాదు. వాటిని అస్సలు తినకూడదు. ముఖ్యంగా పొట్టు తీసిన వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి ఆహారానికి వాడితే విషపూరితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 


టొమాటోలు: టమోటాలు, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. తాజా కూరగాయలను ఉడికించడం చాలా మంచిది. ఈ ఆహారాలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల వాటి పోషకాలు తగ్గడమే కాకుండా విషపూరితం అవుతాయి. ఈ కారణంగా, అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. 


ఉల్లిపాయలు: ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకండి. ఎందుకంటే ఉల్లిపాయ గడ్డకట్టడం వల్ల పిండి పదార్ధం మొత్తం పోతుంది. కాబట్టి, ఉల్లిపాయ ముక్కలను, ఉల్లిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టకండి. ఇలా పెట్టిన వాటిని కూరల్లో అస్సలు వాడకండి. ఆహారంలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అలాంటి ఆహారాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉంది. 


అల్లం: అల్లాన్ని ఎలా నిల్వ చేయాలో తెలియక మార్కెట్ నుంచి తీసుకురాగానే రిఫ్రిజిరేటర్‌లో పెట్టేస్తారు. కానీ ఇలా పెట్టడం ప్రమాదం. రిఫ్రిజిరేటర్‌లో అల్లం నిల్వ ఉంచడం వల్ల మూత్రపిండాలు, కాలేయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిలో ఉండే పోషకాలు మలబద్దకాన్ని నివారిస్తాయి. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచడం వల్ల అందులోని ఔషద గుణాలు దెబ్బతింటాయి. కాబట్టి, ఇకపై అల్లాన్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.


Also Read : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది