Drug for cancer: యూకేకు చెందిన శాస్త్రవేత్తలు ప్రాణాంతకమైన, చికిత్సకు లొంగని క్యాన్సర్‌ను అడ్డుకొనే అద్భుతమైన కొత్త ఔషధాన్ని కనుగొన్నారు. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. క్యాన్సర్ కణితికి ఆహార సరఫరాను నిలిపివేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చెయ్యగలిగారు. JAMA ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆ క్యాన్సర్‌ను కంట్రోల్ చేసే అద్భుత ఔషదం
మెసోథెలియోమా అనేది ఒకరకమైన క్యాన్సర్, ఇది ఊపిరితిత్తుల్లో ఏర్పడుతుంది. ముఖ్యంగా అతిగా ఆస్బెస్టాస్‌కు గురయ్యేవారిలో ఈ క్యాన్సర్ ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. వీరందరికీ ఈ పరిశోధన కొత్త జీవితాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కీమోథెరపీతో కలిపి ఇచ్చే మందు
దీనిపై క్వీన్ మేరి యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ దేశాల్లో అంతర్జాతీయ ట్రయల్ నిర్వహించారు. క్వీన్ మేరీ యూనివర్సిటి ప్రొఫెసర్ పీటర్ స్జ్లోసరెక్ నేతృత్వంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశోధకులు కొంతమంది రోగులను ఎంపిక చేసుకున్నారు. వారికి ప్రతి మూడు వారాలకు ఆరు సార్లు కీమోథెరపిని అందించారు. వారిలో సగం మందికి కేవలం ప్లెసిబో మాత్రమే ఇచ్చారు.
జీవిత కాలం పెరిగింది
ATOMIC-meso అనే ఈ ట్రయల్‌ను 2017, 2021 మధ్య ఐదు దేశాలలో 43 కేంద్రాలలో నిర్వహించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులను కనీసం ఒక సంవత్సరం పాటు పరిశీలించారు. పెగార్గిమినెస్ తోపాటు కీమోథెరపీని పొందిన వారు సగటున 9.3 నెలలు ఎక్కువ జీవించారు. ప్లెసిబో.. కీమోథెరపీతో పోలిస్తే 36 నెలల జీవిత కాలం పెంచింది. ఇది మిగతా మందులతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. కొత్త సమస్యలు లేకుండా పెగార్గిమినెస్ ఆధారిత కీమోథెరపీ మంచి ఫలితాలను ఇచ్చిందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెప్పారు.
క్యాన్సర్‌కు ప్రభావవంతమైన చికిత్స
ఈ కొత్త ఔషదంతో కలిపి ఇచ్చే కీమోథెరపీ మరింత విజయవంతమైన చికిత్సా విధానం. రక్తప్రవాహంలో అర్జినైన్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఇది క్యాన్సర్ మీద పనిచేస్తుంది. ఈ ప్రక్రియ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. క్యాన్సర్ కణాలకు పోషణను పూర్తిగా అడ్డుకోవడం వల్ల వాటిని నశింపజేస్తుందని ప్రొఫెసర్ స్లోసారెక్ వివరించారు. ప్రొఫెసర్ స్లోసారెక్ ఈ ఆవిష్కరణను మొదటి నుంచి పరిశీలించిన నిపుణుల్లో ఒకరు. ఈ చికిత్స మెసోథెలియోమా రోగుల జీవితాలను తప్పకుండా మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. క్యాన్సర్ జీవక్రియలను లక్ష్యంగా చేసుకుని.. కీమోథెరపీతో కలిపి ఇచ్చే ఔషధాల తయారీ విజయవంతం కావడం ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు.
Also read : Onions Benefits: ఉల్లితో ఆరోగ్యమే కాదు, ఈ ప్రయోజనాలు కూడా లభిస్తాయ్