అతిగా చెమట పట్టడం వల్ల శరీరం చాలా ఎలక్ట్రోలైట్‌లను కోల్పోతుంది. దీని వల్ల శరీరం అలిసిపోయిన భావన కలిగి అలసటగా నీరసంగా అనిపిస్తుంది. శరీరం యాక్టివ్‌గా ఉండాలంటే ఎలక్ట్రోలైట్‌లు చాలా అవసరం. అందుకే వాటిని తిరిగి పొందటం కూడా చాలా ముఖ్యం. ఎలక్ట్రోలైట్స్ శరీరంలోని పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్ వంటి లవణాలు, ఖనిజాలు పని తీరుని మెరుగుపరుస్తూ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి శరీరానికి శక్తినివ్వడంతో పాటు హైడ్రేట్ చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఎలక్ట్రోలైట్స్ ఎలా పనిచేస్తాయి?
ఎలక్ట్రోలైట్స్ రక్తం గడ్డ కట్టేందుకు సహాయపడుతుంది. గుండె సక్రమంగా కొట్టుకునేలా చేస్తుంది. రక్తంలో ph స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తంలో ప్లాస్మా ద్రవ స్థాయిలను నియంత్రిస్తుంది. ఆహారం, నీటి నుంచి మనం ఎలక్ట్రోలైట్లను పొందవచ్చు. జ్వరం, విరోచనాలు, వాంతులు అవుతున్నప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతాం. ఆ సమయంలో పానియాల ద్వారా ఎలక్ట్రోలైట్‌లను మనం పొందవచ్చు. శరీరానికి తగినంత ఎలక్ట్రోలైట్‌లు అందకపోతే డీహైడ్రేషన్, ఓవర్ హైడ్రేషన్, కిడ్నీ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే శరీరానికి సరిపడినంత ఎలక్ట్రోలైట్‌లు అందాలి.
ఈ ఆహారంలో ఎలక్ట్రోలైట్స్
పాలు, పెరుగు: ఈ రెండు పాల ఉత్పత్తుల్లో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఒక కప్పు పెరుగులో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటే ఒక కప్పు పాలల్లో 450 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.
అరటి పండ్లు: వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్త పోటుని నియంత్రించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్ళు: కఠినమైన వ్యాయామం తర్వాత తక్షణ శక్తిని ఇస్తుంది. ఎలక్ట్రోలైట్స్ పొందేలా చేస్తుంది.
పుచ్చకాయ: పుచ్చకాయలో సహజమైన చక్కెర ఉంటుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
అవకాడో: దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పొటాషియం మెండుగా ఉంటుంది. శరీరం రీహైడ్రేట్ అవడానికి సహాయపడుతుంది.
మాంసం: మాంసం ద్వారా ఎనర్జీ, ఎలక్ట్రోలైట్స్ పొందుతారు.
పండ్ల రసాలు: నారింజ, నిమ్మ, దానిమ్మ తింటే కూడా ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. ఇవే కాకుండా పాలు శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ ఇస్తాయి.
స్పోర్ట్స్ డ్రింక్: కఠినమైన వ్యాయామాలు చేసిన తర్వాత శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. ఎలక్ట్రోలైట్స్ పునరుద్ధరించడానికి సహాయపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: డయాబెటిక్ బాధితులకు నోరూరించే బ్రేక్ ఫాస్ట్ వంటకాలు ఇవిగో
Also Read: జుట్టు చివర్ల కత్తిరిస్తే నిజంగానే పెరుగుతుందా? నిపుణులు ఏం చెప్తున్నారంటే?