నిద్రలేచిన వెంటనే అలసటగా అనిపిస్తుందా? కళ్ళు మంటలు పుడుతూ పని మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారా? ఇవన్నీ నిద్రలేమి లక్షణాలు. అంటే మీరు సరిపోయింతగా నిద్రపోలేదని చెప్పేందుకు సంకేతాలు. ఒక పరిశోధన ప్రకారం రాత్రి 10 లేదా 11 గంటల మధ్య నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తోంది. ఇది గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన సమయం. సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల శరీరం చాలా నీరసంగా అనిపిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారం కూడా నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటల నిద్ర అవసరం.


నిద్రను నాశనం చేసే అలవాట్లు


ఫోన్ ఎక్కువగా చూడటం 


స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా మందికి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువ సమయం స్క్రీన్ ని చూసేందుకు గడిపేస్తున్నారు. ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి సిర్కాడియన్ రిథమ్‌ ని దెబ్బతీస్తుంది. ఇది మన నిద్ర చక్రాన్ని సక్రమంగా చూసే విధానం. ఎప్పుడు నిద్రపోవాలి, నిద్రలేవాలి అనేవి దీని మీద ఆధారపడి ఉంటాయి. ఈ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పట్టదు. నిద్రకి సహకరించే ప్రధాన హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. మెలటోనిన్ ఉత్పత్తి సరిగా లేకపోతే నిద్రలేమి, చిరాకు, పగటి వేళ నిద్రకి కారణమవుతుంది.


తిన్న వెంటనే పడుకోవడం


చాలా మంది అనుసరించే చెడు అలవాటు ఇది. రాత్రివేళ పడుకునే ముందు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే దాని ప్రభావం నిద్ర మీద పడుతుంది. ఇదే కాదు కడుపు నిండా భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం కూడా మంచిది కాదు. శరీరం భోజనాన్ని జీర్ణించుకోవడానికి సమయం కావాలి. నిద్రపోయేటప్పుడు అటూ ఇటు దొర్లుతూ, తిరగడం వల్ల ఆహారం జీర్ణం కావడం కష్టం అవుతుంది.


కెఫీన్ వినియోగం


కాఫీ అతిగా తీసుకోవడం వల్ల దాని ప్రభావం నిద్ర మీద పడుతుంది. ఇది తాగడం వల్ల రిలాక్స్ గా అనిపిస్తుంది కానీ అతిగా తీసుకుంటే మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. కెఫీన్ నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది.


సూర్యరశ్మి తగలకపోవడం


శరీరానికి సరిగా ఎండ వేడి తగలకపోయినా నష్టమే. తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోతే మెలటోనిన్ ఉత్పత్తి  తగ్గుతుంది. దీని వల్ల నిద్రకి ఆటంకం ఏర్పడుతుంది.


ఒత్తిడి


అన్నింటికంటే నిద్రని ఎక్కువ ప్రభావితం చేసేది ఒత్తిడి. అధిక స్థాయిలో ఒత్తిడి వల్ల నిద్రని దెబ్బతీస్తుంది. నిద్రలేకపోవడం శరీరంలోని హార్మోన్ల పనితీరు అసమతుల్యంగా ఉంటుంది.


ఇవే కాదు నిద్రించే గదిలో ఎక్కువగా కాంతి ఉండకుండా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ఎటువంటి శబ్ధాలు రాకుండా రూమ్ ప్రశాంతమైన వాతావరణం ఉంచుకోవాలి. వీటితో పాటు నిద్రకి సహకరించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: తందూరి చికెన్‌లాగే, తందూరి ఎగ్ రెసిపీ - ఒక్కసారి తిని చూడండి