లికాలంలో చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకు కారణం శరీరం డీహైడ్రేట్ అయిందనే విషయం ఎవరు గుర్తించలేరు. చల్లటి వాతావరణం కారణంగా నీళ్ళు తాగేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అంతే కాకుండా తేమ ఉష్ణోగ్రత వల్ల దాహంగా అనిపించదు. కానీ అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. డీహైడ్రేట్ కారణంగా జీవక్రియలో మార్పులు చోటు చేసుకుంటాయి. తలనొప్పి, అలసట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో తగినంత నీరు లేకపోతే అది రోగనిరోధక శక్తి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే చలికాలంలో కూడా తప్పని సరిగా ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగడం చాలా ముఖ్యం.


నీళ్ళు తాగడం వల్ల చల్లని వాతావరణంలో మూత్రం ఎక్కువగా వస్తుందని వాటిని పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా నీటికి ప్రత్యామ్నాయంగా వీటిని కూడా తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఐదు రకాల పానీయాలు తప్పనిసరిగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాదు చలికాలంలో శరీరం వేడిగా కూడా ఉంటుంది. అటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అంతే కాదు మెరిసే చర్మాన్ని కూడా అందిస్తుంది. నీరు ఎక్కువగా తీసుకున్నప్పుడే చర్మం నిగనిగలాడుతూ కనిపిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు అందించే ఆ ఐదు పానీయాలు ఏమిటంటే..


సూప్: వెచ్చని వెజిటబుల్ సూప్ లు చలికాలంలో చాలా సౌకర్యవంతమైన పదార్థం. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా పేగులకి మంచి చేస్తుంది. భోజనానికి ముందు ఒక గిన్నెలో ఇంట్లో కూరగాయలతో తయారు చేసిన సూప్ తీసుకుంటే చాలా మంచిది. దీని ద్వారా శరీరానికి కావాల్సిన నీటితో పాటు పోషకాలు కూడా అందుతాయి.


గ్రీన్ జ్యూస్: రకరకాల కూరగాయాలతో చేసిన గ్రీన్ జ్యూస్ కి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది రోజువారీ ద్రవ అవసరాన్ని తీర్చడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అంతే కాదు శరీరానికి కావలసిన ఫైబర్ అందిస్తుంది. కూరగాయలు, పండ్లు, మూలికల కలయికతో చేసిన జ్యూస్ లి తీసుకోవడం వల్ల కొన్ని విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి. రోజువారీ పోషక అవసరాలని కూడా ఇవి తీరుస్తాయి. గ్రీన్ జ్యూస్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.


నిమ్మరసం: చిటికెలో తయారు చేసుకోగలిగే మరొక పానీయం నిమ్మరసం. జీర్ణక్రియకి ఇది ఎంతగానో సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


హెర్బల్ టీ: వెచ్చని టీ తాగడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందిస్తాయి. తాజా అనుభూతిని కలిగిస్తాయి. పగటి పూట గ్రీన్ టీ ఆస్వాదించవచ్చు. ఇక రాత్రి సమయంలో ప్రశాంతమైన చామంతి పూల టీ వంటి విభిన్నమైన వాటిని ఎంచుకోవచ్చు. ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలిని అందిస్తాయి. ఇదే కాదు పిప్పరమెంట్ టీ కూడా తీసుకోవచ్చు. దీని వల్ల మలబద్ధకం, తలనొప్పి నివారిస్తుంది. అలాగే మందార టీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తపోటుని తగ్గిస్తుంది. అల్లంతో చేసిన టీ తాగడం వల్ల అజీర్ణం, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అయితే టీలని ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా మాత్రమే తాగాలి. లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజుకి 2 కప్పులకి మించి తీసుకోకూడదు.


పసుపు పాలు: గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. పాలల్లో ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా లాహిస్తాయి. నిద్రకి ఉపక్రమించే ముందు పాలు తాగితే చాలా మంచిది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: రోజుకు ఒక గుప్పెడు పిస్తా పప్పు తింటే మీ గుండె పదిలం