రానున్న 48 గంటల్లో ఉత్తర అండమాన్‌కు ఆనుకొని తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటికల్లా దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొంది. మరోవైపు నిన్నటి వరకు కొనసాగిన అల్పపీడనం పూర్తిగా బలహీన పడింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. తమిళనాడులో కూడా వానలు పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ.
దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దానికి ఆనుకొని ఉన్న పొరుగు ప్రాంతాలపై ఉంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్: తడ (నెల్లూరుజిల్లా) 9సెం.మీ.: సూళ్లూరుపేట (నెల్లూరు జిల్లా ) 9సెం.మీ.; రాయలసీమ: సత్యవేడు (చిత్తూరు జిల్లా) 9సెం.మీ.
అల్పపీడన ప్రభావంతో మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4゚C కంటే తక్కువగా నమోదు కానున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఒడిశాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3-5⁰ C తగ్గే అవకాశం ఉంది.
తెలంగాణలో వాతావరణం
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంమటుంది. హైదరాబాద్‌లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీల మధ్య ఉండే ఛాన్స్ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు, గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీయొచ్చు. తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ పరిస్థితి కనిపిస్తుందని అధికారులు ప్రకటించారు.