కేంద్ర సాయుధ బలగాలైన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్, ఎన్‌ఐఏలో కానిస్టేబుల్(జీడీ) నియామక పరీక్ష-2021 ఫలితాల తుది మార్కుల జాబితాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబర్ 23న వెల్లడించింది. పరీక్ష ఫలితాలను నవంబర్ 7న విడుదల చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల తుది మార్కులను ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా మార్కులను చూసుకోవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది.
మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్, ఎన్‌ఐఏలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల 2021 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిటీ నవంబరు 7న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం మూడు జాబితాల్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొదటి జాబితాలో ఉద్యోగాలకు ఎంపికైన మహిళా అభ్యర్థుల వివరాలు, రెండో జాబితాలో ఉద్యోగాలకు ఎంపికైన పురుషుల వివరాలను వెల్లడించింది. ఇక మూడో జాబితాలో విత్‌హెల్డ్‌లో ఉంచిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది.
మొత్తం 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలకుగాను 24,180 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. 849 మంది అభ్యర్థుల (97 మహిళలు, 752 పురుషులు) ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికైనవారిలో 2847 పోస్టులకుగాను 2598 మంది మహిళలు; 22,424 పోస్టులకుగాను 20,734 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు.సీఏపీఎఫ్, ఎన్‌ఐఏ, ఎస్ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టులు, అసోం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నవంబరు 16 నుంచి డిసెంబరు 15 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఈ ఏడాది మార్చి 25న విడుదల చేశారు.
పరీక్షకు హాజరైనవారిలో 2,85,201 మంది అభ్యర్థులు పీఈటీ/పీఎస్‌టీ పరీక్షలకు అర్హత సాధించారు. వీరిలో మహిళలు-31,657, పురుషులు-2,53,544 మంది ఉన్నారు. వీరికి ఫిజికల్ పరీక్ష అనంతరం ఆగస్టు 12న ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 69,287 మంది అభ్యర్థులు (ఉమెన్-7,465 , మెన్-61,822) తదుపరి దశకు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 4 వరకు మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అనంతరం తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
Also Read:
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 800 ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులు
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఆర్డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి...
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2521 అప్రెంటీస్ ఖాళీలు - టెన్త్‌తోపాటు ఐటీఐ అర్హత ఉండాలి!
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- వెస్ట్ సెంట్రల్ రైల్వే 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధింత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..