ఫిట్ నెస్ కి ఇప్పుడు ప్రజల జీవితాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. చురుకుగా ఉండేందుకు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఫిట్ నెస్ చాలా ముఖ్యం. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతారు. కండరాల బలాన్ని పెంపొందించుకోవడం కోసం జిమ్ లో గంటల తరబడి చెమటోడుస్తారు. బరువు ఎత్తుతూ కండరాలు బలోపేతం చేసుకుంటారు. అయితే వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అంతర్గతంగా గాయాలు అవడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి.
వార్మప్ తప్పనిసరి
వ్యాయామ దినచర్యని వార్మప్ తో స్టార్ట్ చేస్తారు. ఎన్ హెచ్ ఎస్ ప్రకారం వార్మప్ వల్ల హృదయ స్పందన రేటు, రక్తప్రవాహాన్ని పెంచుతుంది. కండరాలకు ఆక్సిజన్ చేరేలా చేస్తుంది. నరాలు, కండరాల మధ్య సంబంధాన్ని సక్రియం చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ దినచర్యలో వెయిట్ లిఫ్ట్ ట్రై చేయాలని అనుకుంటే ముందుగా వార్మప్ చాలా అవసరం. ముందు వార్మప్ చేయకుండా వెయిట్ లిఫ్ట్ చేస్తే కండరాలు దెబ్బతింటాయి. గాయం ప్రమాదాన్ని పెంచుతుంది.
త్వరగా బరువులు ఎత్తవద్దు
కండరాల నిర్మాణానికి వెయిట్ లిఫ్టింగ్ అద్భుతంగా సహాయపడుతుంది. అయితే ఒకేసారి బరువు ఎత్తకుండా మెల్లిగా మొదలుపెట్టాలి. బరువులు వేగంగా ఎత్తడం వల్ల ప్రయోజనం ఉండదు. కేలరీలు బర్న్ అవాలంటే చిన్న చిన్న వెయిట్ నుంచి ఎక్కువ మొత్తంలో కేజీలు మోయాలి.
ఎక్సర్ సైజ్
ఐసోలేషన్ వ్యాయామాలు అద్భుతాలు చేస్తాయి. కండలు పెంచడం మీద మాత్రమే దృష్టి పెడితే ఫిట్ నెస్ కి ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. అందుకే బరువు తగ్గే వ్యాయామాలు కూడా చేయాలి. అందుకే చేసే ప్రతి వ్యాయామం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. కేవలం కండలు పెంచడం మీద దృష్టి పెట్టాలని అనుకుంటే దానికి తగిన నిపుణుల ఆధ్వర్యంలో వ్యాయామాలు చేయాలి.
అతిగా వ్యాయామం చేయొద్దు
శరీర సామర్థ్యాన్ని బట్టి వ్యాయామం చేయాలి. వెయిట్ లిఫ్టింగ్ కండరాలను బలోపేతం చేయడానికి, టోన్డ్ ఫిజిక్ ని సాధించడానికి గొప్ప మార్గం. కానీ త్వరగా కండలు పెంచాలని అనుకుని అతిగా వ్యాయామం చేస్తూ గంటల తరబడి జిమ్ లో కష్టపడుతూ, శరీరాన్ని అతిగా ఒత్తిడికి గురి చేస్తే అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఎంత సమయం తీసుకున్నా ఉత్తమ ఫలితం పొందటం ముఖ్యం. నొప్పి లేదు కదా లాభం కదా అని అతిగా వ్యాయామం చేయకూడదు. శరీర సామర్థ్యాన్ని అర్థం చేసుకుని పరిమితికి మించి చేయొద్దు. అది శరీరాన్ని అతిగా గాయపరుస్తుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత ఆలస్యం అవుతుంది.
ప్రణాళిక ముఖ్యం
కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ ఏదైనా వ్యాయామం చేసే ముందు ప్రణాళిక వేసుకోవాలి. పూర్తి శిక్షకుల పర్యవేక్షణలో ఏ పని అయినా చేయాలి. ఎటువంటి బేసిక్స్ తెలియకుండా చేస్తే మాత్రం శరీరం అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఫిట్ నెస్ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. బరువు తగ్గాలా లేదంటే కండరాలు పెంచుకోవాలా? శరీరంలోని ఏ భాగం తగ్గించుకోవాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: రోజూ జస్ట్ 15 నిమిషాలు మీ ఫోన్ పక్కన పెట్టండి - ఈ అద్భుతాలు చూస్తారు!