మరో పదిహేనురోజుల్లో కొత్త ఏడాది వచ్చేస్తుంది. గూగుల్ అప్పుడే ఈ ఏడాదిని రివైండ్ చేయడం మొదలుపెట్టేసింది. మనదేశంలో 2021లో అత్యధికమంది వెతికిన పది రెసిపీలేంటో చెప్పింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఓటీటీ... ఇలా ఎన్నో ఛానెల్స్ ద్వారా రెసిపీల షోలు పెరుగుతున్నాయి. వాటిని చూసే వాళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఏ రెసిపీల కోసం మనవాళ్లు అధికంగా వెతికారంటే...


1. ఎనోకి మష్రూమ్
ఇది వంటకమని చెప్పలేం కానీ తినే పదార్థమే. 2021లో భారతదేశంల గూగుల్ లో అత్యధికంగా శోధించిన వంటకాలలో మొదటిస్థానం దీనిదే. ఎనోకి మష్రూమ్ మన దేశానికి చెందినది కానప్పటికీ బాగానే ఆదరించారు. ఇది కొన్ని సూపర్ మార్కెట్లలో మాత్రమే దొరుకుతుంది. అయితే మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా, మాస్టర్ చెఫ్ ఇండియా వంటి షోలలో ఈ పుట్టగొడుగుని ఉపయోగించడం వల్ల ప్రజలు దీని గురించి అధికంగా వెతికినట్టు గూగుల్ విశ్వసిస్తోంది. 


2. మోదక్
వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ తినుబండారం రెండో స్థానంలో నిలిచింది. వినాయక చవితికి దాదాపు అందరూ దీన్ని తయారు చేస్తారు. 


3. మేథి మటర్ మలయ్
మెంతి ఆకులు, బఠానీలు, తాజా క్రీమ్‌లతో కలిసి ఈ రుచికరమైన వంటకాన్ని ఉత్తర భారతదేశంలో అధికంగా వండుతారు. దీన్ని నాన్ లేదా బటర్ రోటీతో తింటారు. 


4. పాలక్
పాలక్ పనీర్, పాలక్ చాట్, పాలక్ పకోడా, పాలకూర పప్పు... ఇలా రకరకాల వంటలు చేసుకునే పాలకూర గురించి కూడా ఎక్కువ మందే వెతికారు. దాంతో ఏ వంటకాలు చేయచ్చో శోధించారు. పాలకూర గూగుల్ సెర్చ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. 


5. చికెన్ సూప్
శీతాకాలంలో వేడివేడి చికెన్ సూప్ తాగుతుంటే ఆ కిక్కే వేరప్పా. అందుకే ఈ రెసిపీ గురించి చాలా మంది వెతికారు. 


6. పోర్న్ స్టార్ మార్టిని
2002లో వెనిల్లా ఫ్లేవర్ తో కూడా వోడ్కాను డగ్లస్ ఆంక్రా అనే వ్యక్తి తొలిసారి తయారు చేశాడు. ఆ వోడ్కాకు ‘పోర్న్ స్టార్ మార్టిని’ అని పేరు పెట్టాడు. అతను 2021, ఆగస్టులో మరణించాక ఆయన తయారుచేసిన ఈ పానీయం బాగా పాపులర్ అయింది. దాని గురించి శోధనలు ఎక్కువయ్యాయి. 


7. లాసాగ్నా
ఇటలీలోని నేపుల్స్ అనే నగరంలో లాసాగ్నాను తొలిసారి తయారుచేశారు. ఆ నగరం నుంచి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ప్రయాణం చేసింది లాసాగ్నా. మనదేశంలో కూడా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. 


8. కుకీలు
కరోనా వచ్చాక ఎక్కువ మంది ఇంట్లోనే అధికంగా వండుకోవడం మొదలుపెట్టారు. అలా కుకీలను కూడా బేక్ చేసేందుకు ప్రయత్నించి, రెసిపీ కోసం వెతికారు. భారతదేశంలో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన రెసిపీలలో కుకీలు ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.


9. మటర్ పనీర్
కాటేజ్ చీజ్, బఠానీలు ఉపయోగించి తయారుచేసే ఒక శాకాహార వంటకం ఇది. ఉత్తరభారతదేశంలో పాపులర్ వంటకం. భారతదేశంలో ఏ రెస్టారెంట్లో అయినా ఇది దొరుకుతుంది. 


10. కడా
కడా అనేది పంజాబీలు తయారుచేసే ఒక ప్రసాదం. రవ్వ, గోధుమపిండి, నెయ్యి, పంచదార కలిపి తయారుచేస్తారు. పంజాబీల ఇళ్లల్లో దీన్ని తరచూ వండుకుంటారు. 


Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం


Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్


Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే


Read also: త్వరగా బరువు తగ్గాలా? ఓట్స్‌ను ఇలా ఉపయోగించండి...


Read also: బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్... డయాబెటిస్ ఉన్న వారికి ఏ బియ్యం బెటర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి