వేసవి తాపం మొదలైంది. గంట బయటికెళ్లొస్తేనే ఆ ఎండకి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికీ మరీ ఇబ్బందిగా ఉంటుంది.వీటిలో వంశపారంపర్యంగా చిన్న వయసులోనే వచ్చేది టైప్ 1 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ మాత్రం వారసత్వంగానే కాదు, చెడు జీవన విధానం వల్ల కూడా వస్తుంది. మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ముందుగా మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఉంది. ఆహారాన్ని కూడా సీజన్‌కు తగ్గట్టు తినాలి. పండ్ల విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి డయాబెటిక్ రోగుల్లో. వేసవిలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే. 


అరటి పండు
మధుమేహులు అరటిపండ్లు తినాలంటే భయపడుతుంటారు. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. రోజుకో పండు తినవచ్చు. దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగిపోవు. కాకపోతే బాగా పండిన పండును తింటే కాస్త సమస్య రావచ్చు. ఎందుకంటే వాటిలోనే చక్కెర అధికంగా ఉంటుంది. బాగా పండిన రెండు అరటిపండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కానీ పలకబారినవి తింటే పెద్దగా సమస్య రాదు. అరటిపండులో ఉండే పోషకాలు కూడా షుగర్ పేషెంట్లకు అవసరమే. కాబట్టి రోజుకొకటి తినవచ్చు. 


ద్రాక్షలు
తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష రెండూ ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఓ పది ద్రాక్ష పండ్లు తింటే చాలా మంచిది. షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికమే. 


దానిమ్మ 
దానిమ్మ పండ్లు పిల్లలు, పెద్దలు అందరికీ చాలా అవసరమైనవి. రక్త హీనత సమస్య దరి చేరకుండా కాపాడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో చేరే ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి ఇవి కాపాడతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేసే పండు దానిమ్మ. రోజుకో దానిమ్మ పండు తింటే ఎంతో ఆరోగ్యం. 


స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలు దిగుమతి చేసుకుని అమ్ముతారు కాబట్టి అన్ని కాలాల్లోనూ సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. విటమిన్ సి పుష్కలంగా లభించే పండ్లు ఇవి. రోగనిరోధక శక్తి కోసం వీటిని తినడం చాలా అవసరం. రోజుకు అయిదు పండ్ల వరకు తినవచ్చు. ఇవి తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి కచ్చితంగా మధుమేహులు వీటిని తినాలి.  


నారింజ
మధుమేహ రోగులకు నారింజ పండ్లు స్నేహితులనే చెప్పుకోవాలి. ఎన్ని తిన్నా ఆరోగ్యమే. అంతేకాదు షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే సెలీనియం డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. నారింజను రోజుకు రెండు తింటే చాలా మంచిది. 


Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు



Also read: వేసవిలో చద్దనాన్ని మించిన ఔషధం లేదు తెలుసా? తింటే ఎన్నో లాభాలు