తినే  ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహు రోగులు. వీరు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) ఉండే ఆహారాన్ని మాత్రం తినాలి. అసలు గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి? ఏఏ ఆహారపదార్థాలలో జీఐ తక్కువగా ఉంటుంది? వేటిల్లో ఎక్కువగా ఉంటుంది? అనేది తెలుసుకుందాం. 


గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే?
మనం తినే తిండిలోని గ్లూకోజు ఎంత వేగంగా  మన రక్తంలో కలుసుందనే విషయాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ తో (జీఐ) కొలుస్తారు. అందుకే జీఐ తక్కువున్న ఆహారాలు తినమని సూచిస్తారు వైద్యులు. 


జీఐ అధికంగా ఉండే ఆహారాలు
అన్నం, బంగాళాదుంపలు, మిఠాయిలు, తెల్ల బ్రెడ్డు, మైదాతో చేసిన వంటలు వంటి వాటిలో జీఐ ఎక్కువ. వీటిని తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు విడుదలై కలిసిపోతుంది. దీని వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిలో అమాంతం ఒకేసారి పెరుగుతాయి. ఇలా జీఐ అధికంగా ఉండే ఆహారాల వల్ల మధుమేహులకే కాదు గుండె జబ్బులు ఉన్న వారికి కూడా చాలా ప్రమాదం. 


జీఐ తక్కువగా ఉండే ఆహారాలు
బ్రౌన్ రైస్, పొట్టుతీయని ధాన్యాలు,చికెన్,చేపలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలు వంటివి తక్కువ జీఐ ఉండే ఆహారాలు. వీటిలో ఎలాంటి పిండి పదార్థాలు ఉండవు. వీటిని తిన్నాక హఠాత్తుగా గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. కాబట్టి వీటిని మధుమేహులు, గుండె జబ్బులు ఉన్నవారు తినవచ్చు. ఇవన్న ఆలస్యంగా జీర్ణమవుతూ చాలా నెమ్మదిగా గ్లూకోజును రక్తంలో కలిసేలా చేస్తాయి. 


బరువు కూడా కంట్రోల్‌లో...
తక్కువ జీఐ ఉండే ఆహారాలు తినడం వల్ల బరువు కూడా త్వరగా పెరగరు. అధిక బరువు ఉన్న వారు కూడా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తినడం వల్ల బరువు తగ్గుతారు. 






Also read: పదిరూపాయలకే టేస్టీ బిర్యానీ, తినాలంటే ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే



Also read: వంటసోడా కేవలం పకోడీలు, కేకుల్లో వేయడానికే కాదు, వీటితో ఇంకా ఎన్నో ఉపయోగాలు