బేకింగ్ సోడా అనేది వంటసోడా అనేది వంటల్లో అప్పుడప్పుడు వాడేది. కేక్ మిశ్రమంలో దీన్ని అరస్పూను కలిపితే చాలు మెత్తగా వస్తుంది కేక్. అలాగే పకోడీలు, బజ్జీల్లో వేయడం వల్ల కూడా అవి మెత్తగా వస్తాయి. డీపై ఫ్రై చేసే వంటకాల్లో కచ్చితంగా వీటిని వాడతారు. ఇడ్లీ - దోశె పిండిలో కూడా కలుపుతారు. నిజానికి ఈ పౌడర్ తో ఇంతే ఉపయోగాలు అనుకుంటారు కానీ, నిజానికి ఇంకా ఉన్నాయి.
బేకింగ్ సోడా అంటే...
ఇది కూడా ఒక రసాయన సమ్మేళనమే. దీని శాస్త్రీయ నామం సోడియం బైకార్బోనేట్. అంటే ఇందులో కూడా ఉప్పు ఉంటుంది.
గుండెల్లో మంటకు...
జీర్ణాశయం ఎగువ భాగంలో మండుతున్నట్టు అనిపిస్తుంది చాలా మందికి. గుండెల్లో మంట అనేది యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం కారణం అవుతుంది. బేకింగ్ సోడాలో ఆల్కలీన్ లక్షణాలు ఉంటాయి. ఇది యాసిడ్ ప్రభావాన్ని తటస్తం చేస్తుంది. నీళ్లలో చిటికెడు బేకింగ్ సోడా కలుపుకుని తాగితే మంచిది.
మౌత్ వాష్‌గా...
బేకింగ్ సోడాలోని యాంటీ బాక్టిరియల్ లక్షణాలు మౌత్ వాష్‌గా పనికొస్తాయి. గోరువెచ్చని నీటిలో అరటేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి నోరు పుక్కిలిస్తే మంచిది.
డియోడరెంట్‌గా...
చెమట వాసన పోయేలా చేయడంలో కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. చెమట వాసన రాకుండా ఉండాలంటే చంకల్లో పౌడర్‌కు బదులు బేకింగ్ సోడాను చల్లుకోవాలి. సిల్లీగి అనిపిస్తున్నా... ఇది బాగా పనిచేస్తుంది.
ఎయిర్‌ఫ్రెషనర్‌గా...
బేకింగ్ సోడా ఎయిర్‌ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. చెడు వాసన పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. చెడు వాసన వస్తున్నప్పుడు బేకింగ్ పౌడర్‌ను చల్లితే అది పోతుంది.
దుస్తులపై మరకలు పోగొట్టేలా..
బేకింగ్ సోడా దుస్తులపై మరకలను తొలగిస్తుంది. బేకింగ్ సోడా మీ దుస్తులను తెల్లగా మారుస్తుంది. వాషింగ్ మెషీన్ బట్టలతో పాటూ కాస్త బేకింగ్ సోడా కూడా చల్లండి. మీకే మార్పు కనిపిస్తుంది.
గుండెకి మేలు...
చిన్న గ్లాసు నీళ్లలో, అర టీస్పూను బేకింగ్ సోడా వేసి రోజూ తాగాలి. ఇలా తాగడం వల్ల గుండెకు చాలా మేలు కలుగుతుంంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి అని వివరిస్తున్నారు వైద్యులు. గుండె సమస్యలు తక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగని అధికంగా తాగేయడం మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మితంగా తాగాలి.
Also read: మగవారు తండ్రిగా మారేందుకు ఉత్తమ వయసు ఇదే, సమర్థిస్తున్న వైద్య నిపుణులు
Also read: గర్భంతో ఉన్నప్పుడు చేసే తప్పులు ఇవే