దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1990లలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ ఇది. ఇందులో దళ నాయకుడు రవన్న పాత్రలో రానా నటించగా.. వెన్నెల అనే అమ్మాయి పాత్రలో సాయిపల్లవి కనిపించింది. 


ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.14 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. అంతకుమించి వసూళ్లు సాధిస్తేనే ఈ సినిమా సక్సెస్ అయినట్లు. అయితే ఆశించిన స్థాయిలో సినిమా కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది. రెండోరోజే ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 


రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..?


నైజాం       - రూ. 82 లక్ష‌లు


సీడెడ్       - రూ. 12 ల‌క్ష‌లు


ఉత్త‌రాంధ్ర - రూ. 14 ల‌క్ష‌లు


ఈస్ట్           - రూ. 11 ల‌క్ష‌లు


వెస్ట్           - రూ. 8 ల‌క్ష‌లు


గుంటూరు - రూ. 11 ల‌క్ష‌లు


కృష్ణా         - రూ. 9 ల‌క్ష‌లు


నెల్లూరు    - రూ. 6 ల‌క్ష‌లు


రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.53 కోట్ల షేర్ సాధించింది ఈ సినిమా. దీన్ని గ్రాస్ పరంగా చూస్తే.. రూ.2.50 కోట్లు. కర్ణాటక-రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకి రూ.20 లక్షలు వచ్చాయి. అలాగే ఓవర్సీస్ లో రూ.54 లక్షలు వచ్చాయి. అంటే మొత్తంగా ఈ సినిమా రూ.2.27 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ ప్రకారం చూస్తే.. రూ.3.90 కోట్లు. 'విరాటపర్వం'పై ఉన్న బజ్ కి వస్తోన్న కలెక్షన్స్ కి సంబంధమే లేదు. ఇదే గనుక కంటిన్యూ అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమే.  


Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది


Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?