ప్రపంచవ్యాప్తంగా అధికంగా తినే పండ్లలో యాపిల్ మొదటి స్థానంలోనే ఉంటుంది. దీనిలో ఫైబర్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఆరోగ్యం కోసం రోజుకో యాపిల్ తినమని వైద్యులు సూచిస్తారు. దీన్ని రోజుకో పండు తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని అంటారు. ప్రపంచంలో ఆపిల్స్ మూడు నుంచి నాలుగు రంగుల్లో లభిస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, తెలుపు అలాగే మరో రకం ఆపిల్ కూడా ఉంది. అదే నలుపు ఆపిల్. ఇది చాలా అరుదైనది. ఎక్కడపడితే అక్కడ దొరకదు. ఆపిల్ జాతుల్లో అన్నిటికంటే ఖరీదైన ఆపిల్ కూడా ఇదే. దీన్ని బ్లాక్ డైమండ్ ఆపిల్ అని పిలుస్తారు. అలాగే అబ్సిడియన్ ఆపిల్ అని కూడా అంటారు.


ఎక్కడ దొరుకుతుంది?
టిబేట్ పర్వతాల శ్రేణుల్లో ప్రత్యేకంగా ఈ బ్లాక్ డైమండ్ ఆపిల్స్ ను సాగు చేస్తారు. ఇది మెరిసే చర్మంతో ఉంటుంది. కొన్ని ముదురు ఊదా రంగుతో కూడా ఉంటాయి. లోపల మాత్రం తెలుపు రంగులోనే గుజ్జు ఉంటుంది. మెరిసే ఆ నలుపు రంగు వల్లే దీనికి బ్లాక్ డైమండ్ అనే పేరు వచ్చింది. నల్లగా మెరిసే వజ్రాలను ఇవి గుర్తుకు తెస్తాయి. 


ఆపిల్స్‌లాగే ఈ పండులో కూడా డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు సహకరిస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్లన్నీ ఇందులో ఉంటాయి. వీటిని సాగు చేయడం చాలా కష్టం. అందుకే ఖరీదు అధికంగా ఉంటుంది. సాగు ప్రక్రియలో కచ్చితమైన ఉష్ణోగ్రత, కాంతి నియంత్రణ అవసరం. అందుకే ప్రతి వాతావరణంలో ఇవి పండవు.  వీటి కోసం ప్రత్యేకమైన ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు అవసరం. 


ఆపిల్ పండు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. అప్పటికే పేరుకున్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. చర్మసంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఆపిల్  ముందుంటుంది. తలనొప్పిని తగ్గించడంలో ఈ పండు మేలు చేస్తుంది. ఆస్తమా, అనీమియా, క్షయ, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడే వారు ఆపిల్ పండు తింటే నమయవుతాయి. చర్మంపై ఉన్న మచ్చలను కూడా ఆపిల్ పండులోని పోషకాలు మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఆపిల్ ముందుంటుంది. 



Also read: అర నిమిషంలో ఈ ముగ్గురు యువరాణుల్లో గ్రహాంతరవాసి ఎవరో కనిపెట్టండి



Also read: స్త్రీ, పురుష సంతానోత్పత్తి పై ప్రభావం చూపించే వడగాలులు - జాగ్రత్తలు తీసుకోక తప్పదు






















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.