IQ test: మెదడు చురుగ్గా ఉండాలంటే పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్, ఐక్యూ పరీక్షలను ఎదుర్కొంటూ ఉండాలి. ఇవి మెదడును చురుగ్గా మారుస్తాయి. ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇక్కడ మీకు ఇచ్చినది ఒక చిన్న ఐక్యూ పరీక్ష. ఇక్కడ ఉన్న చిత్రంలో ముగ్గురు యువరాణులు ఉన్నారు. వారిలో ఒకరు గ్రహాంతరవాసి. ఆ ముగ్గురుని పరిశీలనగా చూస్తే గ్రహాంతరవాసి ఎవరో కనిపెట్టేయవచ్చు. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెడతారు. కేవలం అర నిముషంలోనే గ్రహాంతరవాసి ఎవరో కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ ఐక్యూ లెవెల్స్ మంచి స్థాయిలో ఉన్నట్టే లెక్క. ముగ్గురు యువరాణులు పక్కపక్కన నిలుచుని ఉన్నారు. ఒక యువరాణి రెండు పిచ్చుకలతో ఆడుకుంటుంది. మధ్యలో ఉన్న యువరాణి తన చేతుల్లో పువ్వులు పట్టుకుంది. ఇక చివరి యువరాణి తలపై తలపాగాతో నిలబడింది. ఈ ముగ్గురిని తల నుంచి కాళ్ల వరకు పరిశీలనగా చూస్తే మీకు గ్రహాంతరవాసి ఎవరో తెలిసిపోతుంది.


జవాబు ఇదే...
ఇప్పటికే జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. జవాబు కనిపెట్టడానికి కష్టపడుతున్న వారికి మేము ఇక్కడ సమాధానాన్ని ఇస్తున్నాము. మూడో యువరాణిని ఒకసారి చూడండి. ఆమె చేతికి ఉన్న వేళ్లను లెక్కించండి. ఒక వేలు ఆకుపచ్చగా కనిపిస్తుంది. అసాధారణంగా అనిపిస్తుంది. ఆమెనే గ్రహాంతరవాసి. 


ఐక్యూ... ఇంటెలిజెన్స్ కోషియంట్. ఒక వ్యక్తి తెలివితేటలను అంచనా వేసే పరీక్ష ఇది. ఆ వ్యక్తి సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని, తార్కికంగా ఆలోచించే సామర్థ్యాన్ని, అభిజ్ఞా సామర్ధ్యాలను ఈ పరీక్ష కొలుస్తుంది. ఐక్యూ విలువ ఎక్కువగా ఉంటే... వారు ఎక్కువ తెలివితేటలు కలవాలని అర్థం. అదే తక్కువ ఉంటే వారు, తక్కువ తెలివితేటలు ఉన్న వారిని అర్థం. మీ ఐక్యూని ఇక్కడున్న బొమ్మ ద్వారా పరిశీలించుకోండి. 


సాధారణంగా ఒక మనిషి సగటు ఐక్యూ 100 ఉంటుంది. 100 కన్నా ఎక్కువ స్కోరు వస్తే ఆ మనిషి తెలివైన వాడని అర్థం. అంత కన్నా తక్కువ వస్తే తెలివితేటలు తక్కువేనని అర్థం. ప్రపంచంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐక్యూ చాలా ఎక్కువ అని చెప్పుకుంటారు. అలాగే ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఎక్కువే అని అంటారు. వీరిద్దరిది స్కోర్ 160. 145 స్కోర్ దాటితే చాలు వారిని జీనియస్ కిందే చెబుతారు. అదే ఐక్యూ స్కోర్ 70 కన్నా తక్కువ ఉంటే మానసిక సమస్యలు ఉన్న వ్యక్తిగా గుర్తిస్తారు. అదే 85 - 70 మధ్య ఉంటే  ఇంటిలిజెన్స్ తక్కువ అని అంటారు. 85 నుంచి 100 వరకు ఉంటే యావరేజ్‌గా పరిగణిస్తారు. 



Also read: స్త్రీ, పురుష సంతానోత్పత్తి పై ప్రభావం చూపించే వడగాలులు - జాగ్రత్తలు తీసుకోక తప్పదు






















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.