టైప్ 2 డయాబెటిస్ రావడం వల్ల ఇప్పటికే ఎన్నో అనారోగ్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం షాకింగ్ విషయాన్ని చెప్పింది. టైప్ డయాబెటిస్ తో బాధపడతున్నవారి మెదడుకు వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయిట.డయాబెటిస్ లేనివారితో పోలిస్తే ఉన్న వారిలో మెదడు ముసలిదయ్యే వేగం 26 శాతం ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్‌ను అభిజ్ఞా క్షీణతతో ముడిపెట్టడానికి ఇప్పటికే బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కొత్త అధ్యయనం తాలూకు ఫలితాలను ‘eLife’ అనే అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురించారు. దీని ప్రకారం టైప్ 2 డయాబెటిస్ ఉందని నిర్ధారించే సరికే మెదడుకు గణనీయమైన నష్టం జరిగిఉండే అవకాశం ఉన్నట్టు అధ్యయనం సూచిస్తోంది. టైప్ 2 డయాబెటిస్-సంబంధిత న్యూరోడెజెనరేషన్ నమూనాలు సాధారణ వృద్ధాప్య ఛాయలతో కలిసి బలంగా అతి వ్యాప్తి చెందేలా చేస్తాయని చెబుతున్నారు పరిశోధకులు. 


మార్పులను గుర్తించాలి
డయాబెటిస్ వచ్చాక మెదడులో వెంటనే మార్పులు మొదలవుతాయి.కానీ తమకు డయాబెటిస్ వచ్చిందని ఆ రోగులు గుర్తించే సరికే ఆ మార్పులు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. మెదడులో మధుమేహం సంబంధిత మార్పులను గుర్తించేందుకు కొన్ని మార్గాలు వెంటనే అవసరం కానీ ప్రస్తుతానికి మన వైద్యంలో అలాంటి గుర్తించే పరికరాలు, పరీక్షలు లేవు. ‘డయాబెటిస్ నిర్ధారణ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్ల వారు రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలు, శరీర బరువుపై దృష్టి పెడతాయి’ అని పరిశోధనలో భాగమైన డాక్టర్ అభిప్రాయపడ్డారు.  నిజానికి టైప్ 2 మధుమేహం వల్ల నాడీ సంబంధిత ప్రభావాలు కొన్నేళ్ల ముందే మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ లక్షణాలను గుర్తించి, పరీక్షించి,నిర్ధారించే లోపే మెడుకు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని అతను తెలిపారు. 


అధ్యయనం ఇలా...
50 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కుల మెదడులను స్కాన్ చేశారు. వారిలో కొందరికీ డయాబెటిస్ ఉంది, మరికొందరికి లేదు. రెండు వర్గాలుగా విభజించి వారి మెదడులను పరీక్షించారు.వారి మెదడు పనితీరును అంచనా వేశారు. సాధారణ మెదడు, వృద్ధాప్యం, టైప్ 2 డయాబెటిస్... ఈ మూడింటి‌లో కనిపించే మధ్య సంబంధాన్ని వారు అంచనా వేశారు. వారి విశ్లేషణలో ముసలితనం, టైప్ 2 డయాబెటిస్ రెండూ కూడా వర్కింగ్ మెమొరీ, లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ థింకింగ్, బ్రెయిన్ ప్రాసెసింగ్ స్పీడ్ లో మార్పులు వంటి వాటికి కారణం అవుతున్నట్టు గుర్తించారు.  అయితే మధుమేహం ఉన్న వ్యక్తుల కార్య నిర్వాహక పనితీరులో 13.1 శాతం తగ్గుదల ఉన్నట్టు గుర్తించారు. అదే డయాబెటిస్ లేని వారిలో ఆ వేగం 6.7 శాతం మేర మాత్రమే తగ్గినట్టు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ టైఫ్ 2 మధుమేహం, మెదడులో వృద్ధాప్యాన్ని పెంచుతుందని తమ పరిశోధనలు సూచిస్తున్నట్టు నిర్ధారించారు. 


Also read: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే