కొన్నిపనులు చెప్పుకునేందుకు చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ చేస్తే తెలుస్తుంది ఆ పని చేయడం ఎంత కష్టమో. అలాంటిదే గుడ్డు మీద మరో గుడ్డును నిలబెట్టడం కూడా. ఒక గుడ్డు మీద ఇంకో గుడ్డును నిలబెట్టడానికే చాలా ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రక్రియలో వంద గుడ్లు పగిలినా పగలొచ్చు. కానీ ఓ యువకుడు ఏకంగా నాలుగు గుడ్లను నిలబెట్టాడు. అతడు చేసిన ఈ పని గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఆ యువకుడి పేరు మహమ్మద్ ముక్బల్. యెమెన్ దేశానికి చెందిన వాడు. అంతకుముందు మూడు గుడ్లను ఒకదానిపై ఒకటి వరుసగా నిల్చోబెట్టి రికార్డు స్థాపించాడు. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 


ముక్బల్ మాట్లాడుతూ ‘గుడ్డుపై గుడ్డున నిలబెట్టడం చాలా కష్టం. అది పూర్తిగా బ్యాలెన్సింగ్ పై ఆధారపడి ఉంటుంది. బ్యాలెన్సింగ్ కళలో ఆరితేరాలంటే ఓర్పు, ఏకాగ్రత, ప్రశాంతత చాలా అవసరం. అలాగే ఇది ఫిజిక్స్, ఇంజినీరింగ్ సైన్స్ తో ముడి పడి ఉందని కూడా నేను నమ్ముతాను’ అని చెప్పాడు. గుడ్డు గురుత్వాకర్షణ కేంద్రాన్ని సరిగ్గా అంచనా వేస్తే ఇలా నిలబెట్టడం సులువవుతుంది. ముక్బల్ చెప్పిన ప్రకారం గుడ్డు ఒక్కోటి ఒక్కో ఒంపును, ఆకృతిని కలిగి ఉంటుంది, వాటిని గురుత్వాకర్షణ కేంద్రాన్ని కనిపెట్టడమే అత్యంత కష్టమైన భాగం. దాన్ని కనిపెడితే పని త్వరగా అయిపోతుంది. ముక్బల్ చిన్న వయసు నుంచే బ్యాలెన్సింగ్ నైపుణ్యాలను సంపాదించాడు. వాటిని మెరుగుపరుచుకుంటూ వచ్చాడు.   





Also read: చెవిలో గులిమికి ఇయర్ బడ్స్ వాడుతున్నారా? అస్సలు వద్దు, ఎందుకో తెలుసుకోండి


Also read: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో మీకు కనిపిస్తున్న నెంబర్ ఎంత? మీ కంటి చూపుకు ఇది సవాలే