మధుమేహం చాలా ప్రమాదకరం. గతంలో అయితే వంశపారపర్యంగా వచ్చేది. కానీ ఇప్పటి ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. డయాబెటిస్ మూడు రకాలుగా ఉండి ఇబ్బంది పెడుతుంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్, గెస్టేషనల్. టైప్ 1 డయాబెటిస్ పిల్లలు, యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి పుట్టినప్పటి నుంచే ఇన్సులిన్ అందించాల్సి ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటిస్ శరీరానికి అందాల్సిన ఇన్సులిన్ తగిన మోతాదులో అందకపోతే వస్తుంది. ఒక గెస్టేషనల్ అనేది గర్భధారణ సమయంలో కనిపిస్తుంది. ప్రసవించిన తర్వాత తగ్గిపోతుంది. ఎక్కువ మంది టైప్ 2 డయాబెటిస్ తోనే ఇబ్బంది పడుతున్నారు.
డయాబెటిస్ ఏది తిననివ్వదు, తాగనివ్వదు. ఏది తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయో అనే భయం వెంటాడుతుంది. అందుకే తీసుకును ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. టైప్ 2 డయాబెటిస్ నుంచి బయట పడేందుకు ప్రధానంగా ఐదు మార్గాలు ఉన్నాయి. ఇది ఉన్న వాళ్ళు అధిక దాహం, ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం, తీవ్ర అలసట వంటి లక్షణాలు కలిగి ఉంటారు. మనం తీసుకునే ఆహరం మీదే అది ప్రాణాంతకమా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ కి దారి తీసే అవకాశం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.
ఇలా చేయడం వల్ల ప్రమాదం తప్పుతుంది
⦿ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
⦿ ధూమపానం, మద్యపానం నిరోధించడం
⦿ వ్యాయామం చేయడం
⦿ ఆరోగ్యకరమైన బరువు
⦿ ఒత్తిడి తగ్గించుకోవడం
ఈ ఐదు సూత్రాలు పాటించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. ఈ ఐదు సూత్రాలకి కట్టుబడి ఉన్న మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం 90 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వాళ్ళు టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న వారి జాబితాలో ఉన్నారు.
గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిన 4,275 మంది మహిళల డేటాను వాళ్ళు పరిశీలించారు. ప్రసవం తర్వాత వారిలో ఉన్న మధుమేహం తగ్గిపోయింది. దాదాపు 28 సంవత్సరాల పాటు మహిళల బరువు, జీవనశైలిని గమనిస్తూ కొలిచారు. ఈ 28 ఏళ్లలో 924 మంది మహిళలు టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారు. మరొక అధ్యయనం ప్రకారం మధుమేహం అనారోగ్యం కారణంగా 60 శాతం ముందస్తు మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా అకాల మరణం పొందుతున్న పురుషులు 44 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. అంటే వారి ఆయుషు 4.5 సంవత్సరాలు తక్కువగా జీవిస్తారు. మధుమేహం ఉన్నా కూడా ధూమపానం చేయడం వల్ల వారి జీవిత కాలం 10 ఏళ్లు తగ్గుతుందని నిపుణులు తెలిపారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గర్భిణీలు మైక్రోవేవ్ అవెన్‌లో వంట చేయొచ్చా? కడుపులో బిడ్డకు హానికరమా?
Also Read: కోడి గుడ్డే కాదు, దాని పెంకు కూడా ఆరోగ్యానికి మేలే!