అంతర్లీనంగా శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో, ఎలాంటి వ్యాధులు దాగి ఉన్నాయో చెప్పడం కష్టం. ఆధునిక కాలంలో వింత రోగాల సంఖ్య పెరిగిపోతుంది. అలా ఒక మహిళకు చిన్నగా కడుపునొప్పి వచ్చింది. అది ఒత్తిడి కారణంగా వచ్చినట్టు ఆమె భావించింది. వైద్యులను కలిసి పొట్టనొప్పి వస్తున్నట్టు, అలాగే అలసట కూడా ఉన్నట్టు చెప్పింది. ఆమె రెండు ఉద్యోగాలను చేయడం వల్ల ఆమెకు తీవ్ర ఒత్తిడి కలుగుతున్నట్టు భావించింది. ఆ ఒత్తిడి కారణంగానే ఈ కడుపునొప్పి కూడా వచ్చిందని వివరించింది. వైద్యులు పరీక్ష చేశాక ఆమెకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అది ఒత్తిడి వల్ల వచ్చింది కాదని, వెంటనే చికిత్స చేయకపోతే కేవలం ఒకరోజు మాత్రమే ఆమె జీవిస్తుందని చెప్పారు. ఆమె పేరు విక్టోరియా డాన్సన్. ఇంగ్లాండులోని జీవిస్తోంది. 


కడుపునొప్పికి కారణం IBD అని పిలిచే ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి అనుకున్నారు వైద్యులు. అయితే దానికి చికిత్స అందించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆమెకి కొలనోస్కోపీని చేశారు. అందులో ఆమెకి క్రోన్స్ వ్యాధి ఉన్నట్టు బయటపడింది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి వస్తోంది. చికిత్స అందకపోతే 24 గంటల్లో మరణించే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. ఈ క్రోన్స్ వ్యాధి ఎవరికి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది.


ఏమిటి క్రోన్స్ వ్యాధి?
క్రోన్స్ వ్యాధి అనేది జీర్ణాశయంతర పేగులను చాలా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా శరీరంలోనే ఈ వ్యాధి ఉన్నా... ఆ విషయాన్ని త్వరగా బయటపడనివ్వదు. తీవ్రమైన విరేచనాలు, పొట్టనొప్పి, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలను చూపిస్తుంది. ఇవన్నీ కూడా సాధారణ లక్షణాలు కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇది ఎందుకు వస్తుందో ఇప్పటివరకు కారణం మాత్రం తెలియలేదు. ఈ క్రోన్స్ వ్యాధి వల్ల శరీరం అసాధారణంగా రోగనిరోధక ప్రతిస్పందనను కలిగి ఉంటుంది. విక్టోరియా కేసులో కూడా అదే జరిగింది. ఆమె పొత్తి కడుపులో చీము కూడా ఏర్పడి పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ప్రాణాంతకమైన సెప్సిస్ ఏర్పడింది. ఆమె జీవించే కాలం 24 గంటలు అని వైద్యులు నిర్ధారించారు. కానీ ఆధునిక వైద్యశాస్త్రంతో అత్యవసర శస్త్ర చికిత్సను చేశారు. ఆమె అండాశయాలపై ఉన్న చీమును తొలగించారు. అంతేకాదు ఆపరేషన్ సమయంలో ఆమె పేగు నుండి 18 అంగుళాల భాగాన్ని తొలగించారు. ఆ పేగును తొలగించినందుకు... చిన్న పేగు నుండి వ్యర్ధాలను సేకరించేందుకు ఉపయోగించి వైద్య పరికరాన్ని అమర్చారు.


ఆమె శస్త్ర చికిత్స తర్వాత జీవించే కాలం పెరిగింది. ఇప్పుడు ఆమే తన జీవనశైలినే మార్చుకుంది. రెండు ఉద్యోగాలు చేయడం మానేసింది. అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తినడం మొదలుపెట్టింది. గ్రీన్ టీ రోజూ తాగుతోంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చిన జీతంతోనే సర్దుకుంటోంది.


Also read: ఏడ్చి ఏడ్చి అంధుడిగా మారిన వ్యక్తి, అలాంటి పనులు చేస్తే ఇలానే జరుగుతుంది మరి

























































































































































































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.