వెర్రి వేయితలలు వేయడం అంటే ఇదే. ఓ వ్యక్తి ప్రపంచరికార్డును నెలకొల్పడానికి ప్రయత్నించి కళ్లు పొగొట్టుకున్నాడు. అతను ఏడు రోజులు పాటూ ఆగకుండా ఏడ్చి ప్రపంచ రికార్డు సాధించాలనుకున్నాడు. అతను నైజీరియాకు చెందిన వ్యక్తి. ఆఫ్రికా దేశాలకు చెందిన ఎంతో మంది రికార్డులు క్రియేట్ చేయడానికి భారీ ఎత్తున ప్రయత్నిస్తున్నారు. అలాగే టెంబు ఎబెరే అని పిలిచే యువకుడు ఏడ్వడంలో రికార్డు క్రియేటన్ చేసేందుకు ప్రయత్నించాడు. వారం పాటూ ఆగకుండా ఏడ్చే సవాలును స్వీకరించాడు. అతను రెండు మూడు రోజుల పాటూ ఏడ్చాక అతనికి తలనొప్పి వచ్చింది. కళ్లు ఉబ్బిపోయాయి. 45 నిమిషాల పాటూ కళ్లు కనిపించకుండా అయిపోయాయి. ఆ కాలంలో అతనికి ఏమీ కనిపించలేదు. తాను అంధుడిని అయినట్టు గుర్తించాడు. అప్పుడు నిజంగా భయపడిపోయాడు. ఓ గంట తరువాత తిరిగి కళ్లు సాధారణంగా కనిపించడం మొదలయ్యాయి. దీంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇలాంటి రికార్డులను సాధించేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. 
 
మేలో హిల్డా బాసీ అనే చెఫ్  కూడా 100 గంటలపాటు నిరంతరం వండి రికార్డు క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె వండిన వంటలను చూసేందుకు  అధికారిక వెబ్‌సైట్ అయిన guinnessworldrecords.com రెండు రోజుల పాటు క్రాష్ అయిపోయింది. లక్షల మంది ఆ వెబ్ సైట్‌ను చూడడం ప్రారంభించారు. 2019లో మరొక వ్యక్తి 93 గంటల 11 నిమిషాల పాటూ వంట చేసి రికార్డు సాధించాడు. ఇప్పుడు 100 గంటలు వండడం ద్వారా బాసీ ఆ రికార్డును బద్ధలు కొట్టింది. 


కొంతమంది రికార్డులను సాధించేందుకు ప్రయత్నించి చతికిల పడిన వారు ఉన్నారు. మసాజ్ ఎండ్యూరెన్స్ రికార్డ్‌ను సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి 50 గంటల పాటూ మసాజ్ చేసి కుప్పకూలిపోయాడు. స్పెయిన్ కి చెందిన ఓ వ్యక్తి హైహీల్స్ ధరించి వందమీటర్లు పరిగెట్టాడు. అది కూడా కేవలం 12.82 సెకన్లలోనే. గతంలో ఆండ్రీ అనే వ్యక్తి 14.02 సెకన్లలో 100 మీటర్లలో హైహీల్స్‌తో పరుగెత్తాడు. ఇప్పుడు ఆ రికార్డును ఇప్పుడు బద్దలు కొట్టారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాకు చెందిన హెల్మెక్ గంటలో 3,202 పుష్ అప్‌లు తీశాడు. గంటలో వంద తీయడమే చాలా కష్టం. అలాంటిది ఏకంగా 3000కు పైగా పుష్ అప్‌లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇలాంటి రికార్డులు సాధించేందుకు ఎంతో మంది యువత రోజూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రతి ఏటా ఎన్నో గిన్నిస్ రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రం ఇలా విచిత్రంగా ఉంటాయి.



Also read: డయాబెటిక్ రోగులు వానాకాలంలో మీ పాదాలను ఇలా కాపాడుకోండి


Also read: చాక్లెట్ అతిగా తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రాక తప్పవు


























































































































































































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.