Diwali Outfit Ideas : దీపావళి దగ్గరికి వచ్చేస్తుంది. ఆ సమయంలో మీరు కూడా ఓ దివాలాగే కనిపించాలనుకుంటారు. అయితే పండుగకు ఎలాంటి దుస్తులు ధరించాలో అనే ప్రశ్నకు అమ్మాయిల దగ్గర సమాధానమే ఉండదు. ఎందుకంటే.. ఏ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటామో అనే భయంతోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు కూడా ఆ జాబితాలో ఓ భాగమేనా? అయితే ఇక్కడ మీకు కొన్ని ఔట్ఫిట్ ఐడియాలున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ దివాళీకి ఎలాంటి ఔట్ఫిట్లు ఎంచుకోవాలో.. వాటితో ఎలా రూల్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అనార్కలీ డ్రెస్..
కాలాతీతమైన ట్రెడీషనల్ డ్రెస్‌లకు అనార్కలీ పెట్టింది పేరు. ఏ పండుగకైనా.. అనార్కలీ మిమ్మల్ని అందరినుంచి ప్రత్యేకం చేస్తుంది. మీ అందాన్ని రెట్టింపు చేయడంలో ఇది ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. ఫ్లోర్ లెంగ్త్ అనార్కలి డ్రెస్‌లు మిమ్మల్ని ట్రెడీషనల్గా అదే సమయంలో హాట్‌గా కూడా చూపిస్తాయి. ఇవి మీరు ఇంట్లోనే ఉండి పండుగ చేసుకున్నా.. లేదంటే పండుగ కదా ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా కంఫర్ట్‌గా ఉంటాయి.
అయితే మీరు కూడా ఈ దివాళికి అనార్కలీ వేసుకోవాలని చూస్తున్నారా? అయితే షిఫాన్, జార్జెట్ వంటి తేలికైన, కంఫర్ట్‌నిచ్చే దుస్తులను ఎన్నుకోవచ్చు. ఇది మిమ్మల్ని సాంప్రదాయకంగానే కాదు.. ఆధునికంగా కనిపించేలా చేస్తుంది. ఈ డ్రెస్ ఎంచుకుంటే బ్యాక్ డీప్ కట్, ఫుల్ హ్యాండ్స్‌తో వచ్చే వాటిని ఎంచుకోవచ్చు. దీనిపై మీరు దుపట్టా వేసుకోవాలా? వద్దా? అనేది పూర్తిగా మీ వ్యక్తిగతమే. ఒకవేళ మీరు దుపట్టా వేసుకోవాలని చూస్తున్నట్లయితే.. షీర్, ఫ్లోర్ లెంగ్త్ దుపట్టాలు ఎంచుకోండి. భారీ జుంకాలు పెట్టుకుని.. మీ హెయిర్ లీవ్ చేస్తే.. మిమ్మల్ని బీట్ చేసేవారుండరు. ట్రెండీగా కనిపించాలనుకుంటే.. దుపట్టా, చురీదార్ లేకుండా గౌనులాగా కూడా దీనిని ధరించవచ్చు.
చీరలు..
పండుగ కళను చీరలే తీసుకొస్తాయంటే అతిశయోక్తి కాదు. పైగా ఇవి ఫ్యాషన్‌కు అనుగుణంగా.. కొత్త లుక్స్, వెరైటీ బ్లౌజ్‌లతో వస్తున్నాయి. కాబట్టి అటు ట్రెండీగా, ఇటు ట్రెడీషనల్గా కూడా అదిరే లుక్స్ ఇస్తాయి. దీపావళి సమయంలో మీరు కూడా ఓ అందమైన క్రాకర్‌గా కనిపించాలనుకుంటే.. పట్టు వస్త్రాలు, బన్సారీలు ఎంచుకోవచ్చు. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే.. మీరు సింపుల్ శారీలకు ట్రెండీ జ్యూవెలరీ యాడ్ చేయవచ్చు.
చీరల్లో నలుపు లేదా గోల్డెన్ రంగు శారీలను ఎంచుకోవచ్చు. లేదంటే కుంకుమ ఎరుపు రంగు చీర కూడా మిమ్మల్ని అందరిలోనూ అందంగా కనిపించేలా చేస్తుంది. ఇవే కాకుండా పాస్టెల్ కలర్స్ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. వాటిపైన మంచి డిజైన్స్ ఉన్న శారీలను దీపావళికి ఎంచుకోవచ్చు. త్రి క్వార్టర్ స్లీవ్స్‌తో కూడిన బ్లౌజ్స్తో మీరు శారీని జత చేయవచ్చు. ప్రీ డ్రేప్ శారీలు, ధోతి శైలి చీరలు, 1 మినిట్ శారీలను కూడా మీరు ఎంచుకోవచ్చు. కొన్ని బ్లౌజ్ ప్లేస్‌లో షర్ట్ మోడల్స్ వస్తున్నాయి.
షరారా
నలుగురిలో మీరు భిన్నంగా.. అందంగా కనిపించేందుకు మీరు షరారాలు ఎంచుకోవచ్చు. ఇవి వివాహాలు, ఈద్లకు మాత్రమే వేసుకుంటారనుకుంటే అది పొరపాటే. షరారాలను ప్రతి తెలుగు పండగల సమయాల్లో ఉపయోగించవచ్చు. దానిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇక్కడ పాయింట్. ఇదో ఫ్యాషన్ డ్రెస్ అనుకుంటారు కానీ.. దీని ఫ్లేర్డ్ ప్యాంట్ మీకు ట్రెడీషనల్ లుక్ ఇస్తుంది. ఇలాంటి ప్యాంట్‌ను మీరు పొడవైన కుర్తాతో జత చేయవచ్చు. జరీ, పూసలతో మరింత అందంగా మీ డ్రెస్‌ను డిజైన్ చేసుకోవచ్చు. బాలీవుడ్లో మొదలైన ఈ ట్రెండ్.. మెల్లిగా తెలుగు రాష్ట్రాలకు సైతం వస్తుంది. కొందరు షరారాతో చీరను జత చేసి కొత్తగా ట్రై చేస్తున్నారు. వాటికి మీరు లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. మెడలో ఏమి వేసుకోకుండా.. అందమైన బ్యాంగిల్స్‌తో మీ లుక్ సెట్ చేసుకోవచ్చు.
ఇవేకాకుండా మీరు పలాజో, కుర్తీలను పండుగ సమయంలో ఎంచుకోవచ్చు. ప్రింటెండ్, ఎంబ్రాయిడరీ చేసిన కేప్ టాప్‌లు కూడా మీకు ట్రెండీ, ట్రెడీషనల్ లుక్ ఇస్తాయి. ఈ టాప్‌లను మీరు పొడవైన స్కర్ట్‌లతో జత చేయవచ్చు. ఎథ్నిక్ ట్విస్ట్ ఉన్న జంప్ సూట్లు కూడా మీరు ట్రై చేయవచ్చు. భారీ ఆభరణాలతో మీరు దీనిని జత చేయవచ్చు. ఈ డ్రెస్‌లు మిమ్మల్ని సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అన్నట్లు చూపిస్తాయి.
Also Read : దీపావళికి ఈ క్రియేటివ్ ఐడియాలతో మీ ఇంటిని ఇలా అందంగా అలంకరించేయండి