Diwali Decor Ideas 2023: ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీనిలో పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. ఇళ్లు, వీధులు రంగు రంగుల లైట్లు, దీపాలతో ఆకట్టుకుంటాయి. బంధు, మిత్రులతో ఇళ్లు కళకళలాడుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మహిళలకు ఉండే పెద్ద పని ఏంటంటే ఇంటిని సర్దుకోవడం, అలంకరించడం. కొన్ని క్రియేటివ్ టిప్స్ పాటిస్తే.. సింపుల్​గా మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోగలరు. మరి ఆ టిప్స్​ ఏంటో వాటిని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.


లైట్స్ అలంకరించడం..


దీపావళి అనే కాదు.. ప్రతి పండుగకు ఇంటిని రెడీ చేసేందుకు ముందుగా ఇంటిని శుభ్రం చేయండి. దీపావళి అంటే దీపాల పండుగ (Deepavali 2023). మరి ఈ సమయంలో దీపాలతో ఇంటిని అలంకరించకపోతే ఎలా? కాబట్టి ఇంటి ముందు లైట్లు వేలాడదీయండి. ఇది మీ ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాకుండా.. పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఈ లైట్లు ఆన్​లైన్​లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. లేదంటే మీరు బయట స్టోర్​లలో కూడా కొనుక్కోవచ్చు. కాబట్టి మీ టేస్ట్​కి తగ్గట్లు రంగు రంగుల లాంతర్లు ఎంచుకుని వాటితో ఇంటిని బయట డెకరేట్ చేయొచ్చు.


థీమ్ డెకర్ - Diwali Theme 2023


ఇంట్లో మీరు థీమ్ డెకర్ చేయొచ్చు. సోషల్ మీడియాలో ఇన్నోవేటివ్, క్రియేటివ్ డెకరేట్​ ఐడియాలు మీ ముందు ఉంటున్నాయి. వాటిలో మీకు నచ్చింది.. లేదా మీరు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే.. మీరే సరికొత్త థీమ్ డెకర్ చేయొచ్చు. దీనికి ఫెయిరీ లైట్స్​ మరింత మెరుపునిస్తాయి. ఇవి మీకు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటాయి. కావాల్సిన మెటీరియల్ కోసం.. మీరు షాప్​లకు వెళ్లడమే మంచిది. ఫోటో కార్డులను కూడా మీరు డెకర్​లో భాగం చేయొచ్చు. 


దియాలు.. Diwali Diya Ideas


మీరు సాంప్రదాయ పద్ధతిలో ఇంటిని డెకరేట్ చేయాలనుకుంటే.. దియాలు మీకు పర్​ఫెక్ట్​ ఆప్షన్. వీటి ప్రాంతంలో కొవ్వొత్తులు, ఎలక్ట్రిక్ దియాలు కూడా ఉంచవచ్చు. క్రియేటివ్​గా ఉంచేందుకు చాలా మంది ఫెయిరీ లైట్లు ఉపయోగిస్తున్నారు. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి. కాబట్టి ఇవి మీకు మంచి ఎంపిక అవుతాయి. డిఫరెంట్​ రంగుల్లో ఈ లైట్లను ఎంచుకోవచ్చు. వాటిని కిటికీలు, గోడలపై వేలాడదీయవచ్చు. మెట్లు, గోడలపై కూడా వీటిని ఉపయోగించవచ్చు. 


పర్యావరణానికి అనువైనవి..


చాలా మంది ఇప్పుడు పర్యావరణానికి హానీ చేయని అలంకరణల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదో కొత్త ట్రెండ్​ అని కూడా చెప్పవచ్చు. దీనిలో భాగంగా పర్యావరణానికి హానీ చేయని.. కాలుష్యం లేని డెకర్​కు మీరు వెళ్లొచ్చు. కాబట్టి మీ ఇంటిని అందంగా పూలతో అలంకరించుకోవచ్చు. మామిడాకుల తోరణాలు కట్టొచ్చు. పూలతో రంగవల్లులు వేయొచ్చు. వాటి మధ్యలో దీపాలు పెడితే మీకు మెరిసే లైట్లు అవసరమే ఉండదు. ప్లాస్టిక్ మెటిరియల్​కు దూరంగా ఉంటూ.. పూలు, ఆకులు, జనపనార, నెట్టెడ్ దుపట్టాలతో మీరు డెకరేషన్ చేసుకోవచ్చు.


మీ ఇంటికి మరింత మెరుపునివ్వడం కోసం.. సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ ప్లేస్ చేయవచ్చు. మీ ఇంటిని ప్రకాశవంతం చేసే మార్గాల్లో ఇది ఒకటి. పువ్వులు, దీపాలతో కలిపి లేక.. కర్టెన్​కు ఎటాచ్​ చేసి మీరు డెకర్ చేయవచ్చు. ఇది ఇంట్లో మొత్తం అలంకరణలో ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ పువ్వులు, లైట్లు ఎంచుకునేప్పుడు ఇంట్లోని గోడల రంగులకు పూర్తిగా విరుద్ధంగా ఉండేలా చూసుకోండి. ఈ క్లాసిక్, సింపుల్​ చిట్కాలతో ఈ దీపావళికి మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దేయండి. 


Also Read : చలికాలంలో ఈ సింపుల్​ వ్యాయామాలతో మోకాళ్ల నొప్పులు దూరం చేసుకోవచ్చు