జ్వరం రావడం సహజం. చికిత్స తీసుకుంటే అది తగ్గిపోతుంది. జ్వరంలో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి అయితే దాదాపు సకాలంలో చికిత్స అందిస్తే ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ ప్రపంచంలోనే అతి భయంకరమైన జ్వరం ఒకటి ఉంది. అదే కాంగో హేమరేజిక్ ఫీవర్. ఇది టిక్ బర్న్ వైరస్ వల్ల కలిగే జ్వరం. ఇది పేలు ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తుల రక్, శరీరం నుంచి వచ్చే ద్రవాల వల్ల ఈ ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ పేలు ఆ ద్రవాలను మోసుకెళ్తాయి. అలా ఈ కాంగో ఫీవర్ విస్తరిస్తుంది. ఉగాండాలో 35 మందికి ఈ జ్వరం వస్తే అందులో 32 మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ జ్వరం తీవ్రమైనది. ఈ ఫీవర్ ను అడ్డుకోవడానికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
35 ఏళ్ల ఒక వ్యక్తికి ఈ జ్వరం సోకింది. ఈ జ్వరం సోకాక పది రోజులు పాటు ఈ ఫీవర్ తో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కళ్ల నుంచి రక్తస్రావం జరిగింది. దాన్ని అదుపు చేయడం వైద్యుల వల్ల కాలేదు. దీంతో ఆ వ్యక్తి మరణించాడు. చికిత్స చేయాలంటేనే వైద్యులు భయపడే స్థాయిలో ఉంది సమస్య.
లక్షణాలు
ఈ కాంగో ఫీవర్ వైరస్ సోకిన మూడు, నాలుగు రోజుల తర్వాతే లక్షణాలను చూపిస్తుంది.
1. తీవ్ర జ్వరం
2. కండరాల నొప్పులు
3. మైకం, వికారం
4. మెడ నొప్పి
5. తలనొప్పి
6. తీవ్రమైన వెన్నునొప్పి
7. కళ్ళునొప్పి
8. వెలుగును చూడలేకపోవడం
9. అతిసారం
10. పొత్తికడుపులో నొప్పి
11. గొంతులో మంట
ఈ లక్షణాలన్నీ కాంగో ఫీవర్ వల్ల కలుగుతాయి.
గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఆ దద్దుర్ల నుంచి రక్తస్రావం జరుగుతుంది. ముక్కు నుండి రక్తం కారడం, చిగుళ్ళ నుండి రక్తస్రావం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సమస్య తీవ్రంగా మారితే కంటి నుంచి రక్తస్రావం జరుగుతుంది. అలాగే మూత్రపిండాలు, కాలేయం విఫలమవుతాయి. గుండె వైఫల్యం చెందుతుంది.
ఇలాంటి భయంకరమైన జ్వరాలను తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. అంతేకాదు అతి శుభ్రంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ, శారీరకంగా చురుకుగా ఉండాలి. బరువు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. అంటే మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ధూమపానం, మద్యపానం వంటివి మానేయాలి. పాజిటివ్ థింకింగ్ తో ముందుకు సాగాలి.
Also read: ఎక్కువసేపు ఫోన్ చూస్తే మొటిమలు వచ్చే అవకాశం, రాకుండా ఇలా నివారించండి
Also read: నా భర్త నన్ను మోసం చేశాడు, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.