ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాంకేతికత పరుగులు పెడుతున్న యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఒకరితో ఒకరిని కనెక్ట్ చేయడమే కాదు ఉద్యోగ పరంగా కూడా స్మార్ట్ ఫోన్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఎంతోమంది పక్కవారితో మాట్లాడటం మానేసి, ఫోన్లలోనే గడుపుతున్నారు. రాత్రి అయితే చాలు ఫోన్లో సినిమాలు చూస్తూ ఎక్కువ సమయం చర్మంపై ఆ కాంతి పడేలా చేస్తున్నారు. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం. ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా అక్షరాలా నిజం. స్మార్ట్ ఫోన్ వల్ల చర్మం దెబ్బ తింటుంది. బాత్రూంలో ఉండే టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కంటే ఫోన్ పై ఉన్న బ్యాక్టీరియానే ఎక్కువ. అలా ఫోన్ ముఖానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా చర్మానికి చేరుతుంది. దీనివల్ల మొటిమలు, ఇతర సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇలా చేయండి
మీ మొబైల్‌ను రోజూ యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ తో తుడవాలి. లేదా 70% ఆల్కహాల్ ఉన్న పానీయంలో ముంచిన వస్త్రంతో తుడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దానిపై ఉన్న బ్యాక్టీరియా పోయే అవకాశం ఉంది. తద్వారా చర్మాన్ని కూడా కాపాడుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్లు అధికంగా వాడడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా మొబైల్‌ను బాత్రూంలోకి తీసుకెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇలా తీసుకెళ్లడం వల్ల ఫోన్ పై ఉన్న బ్యాక్టీరియా మరింత పెరుగుతుంది, కానీ తగ్గదు. కొత్త తరానికి వ్యసనంగా మారిన ఈ ఫోన్ వాడకంపై జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. ఇది మానసిక ఆరోగ్యం పై కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆందోళన, నిరాశను పెంచుతుంది. డిప్రెషన్ బారిన త్వరగా పడేలా చేస్తుంది. ప్రతి విషయానికి ఫోన్ పైన ఆధారపడుతుండడం వల్ల తెలివితేటలు తగ్గిపోతాయి. మొబైల్ అధికంగా వాడడం వల్ల పాక్షికంగా చూపు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండలో మొబైల్ ను చూస్తే అది కళ్లపై మరింతగా ప్రభావం చూపిస్తుంది. ఫోన్ స్క్రీన్ పై సూర్య కాంతి పడి, ఆ ప్రతిబింబం కంటి మీద పడి చూపుకు నష్టం కలుగుతుంది. ఫోన్ చూడడం వల్ల రెటీనాపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది. ఫోన్ అధికంగా వారే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయి.
Also read: నా భర్త నన్ను మోసం చేశాడు, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.