Temple Brain Monitoring Device : ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడానికి మణికట్టుకు స్మార్ట్‌వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌ను పెట్టుకుంటున్నారు. రోజూ ఎంత నడుస్తున్నారో.. హార్ట్ రేట్, స్లీప్ సైకిల్ ఎలా ఉందో తెలుసుకునేందుకు వీటిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు వాటికి భిన్నంగా మణికట్టుకు కాకుండా తలకు ధరించే ఒక ప్రత్యేకమైన పరికరం మార్కెట్లోకి వచ్చింది. 

Continues below advertisement

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ టెంపుల్ అని పిలిచే కొత్త పరికరాన్ని అభివృద్ధి చేయగా.. ఇటీవల క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా దీనిని పెట్టుకుని కనిపించారు. మరి ఈ చిన్న పరికరం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు.. స్మార్ట్​వాచ్​, ఫిట్​నెస్ బ్యాండ్​ల కంటే ఇది ఎందు ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి

Continues below advertisement

టెంపుల్ ప్రత్యేకతలివే..

స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు మీ రోజువారీ అడుగులను లెక్కించడానికి.. ఖర్చయిన కేలరీలను ట్రాక్ చేయడానికి, హృదయ స్పందన రేటును కొలవడానికి హెల్ప్ అవుతాయి. వీటికి విరుద్ధంగా టెంపుల్ అనే పరికరం నేరుగా మీ మెదడుపై దృష్టి పెడుతుంది. దీనిని మీ నుదుటి పక్కన.. కణతపై ధరిస్తారు. ఈ పరికరం మీ మణికట్టుపై ఉన్న నాడిని కాకుండా.. మీ మెదడులోని నరాలలో జరిగే మార్పులను నిశితంగా పర్యవేక్షిస్తుంది.

ఈ చిన్న పరికరం బ్రెయిన్‌ఫ్లో అనే ఒక ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగిస్తుంది. దీనిలో కాంతి ఆధారిత ఆప్టికల్ సెన్సార్లు ఉంటాయి. ఇవి కణతల చర్మం గుండా కింద ఉన్న సిరలు, కణజాలాలపై కాంతిని ప్రసరింపజేస్తాయి. మెదడు రక్త ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు.. ఈ సెన్సార్లు సంకేతాలను తక్షణమే గ్రహించి.. ఆ డేటాను మీ ఫోన్ యాప్‌కు పంపుతాయి.

Also Read : బరువు తగ్గాలా? కఠినమైన డైట్ వద్దు, ఈ చిన్న మార్పులు చాలు అంటోన్న హెల్త్ కోచ్.. వీటితో పది కిలోలు తగ్గిందట

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చా?

సాధారణ స్మార్ట్‌వాచ్‌లు పని చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు లేదా గేమింగ్ చేసేటప్పుడు మన మెదడు ఎంత అలసిపోతుందో ఖచ్చితంగా కొలవలేవు. కానీ టెంపుల్ పరికరం మానసిక ఒత్తిడిని సూచించడానికి, మెదడులోని రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ స్థాయిలను కొలిచేందుకు హెల్ప్ చేస్తుంది. దీనివల్ల వివిధ పనులు చేసేటప్పుడు, విశ్రాంతి తీసుకునే సమయంలో మెదడు ఎలా రియాక్ట్ అవుతుందో వినియోగదారులు అర్థం చేసుకోగలుగుతారు.

రోజూవారీ అలవాట్లపై ప్రభావం..

ఈ పరికరం ముఖ్య లక్షణం దాని ఎంట్రోపీ స్కోర్. ఇది 1 నుంచి 250 మధ్య స్కోర్‌ను అందిస్తుంది. ఈ స్కోర్ మీ శరీరం, మనస్సుపై ఉన్న మొత్తం ఒత్తిడిని సూచిస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం, రోజువారీ ఒత్తిడి, కెఫిన్ వినియోగం, తీవ్రమైన వ్యాయామాలు చేసినప్పుడు ఈ స్కోర్‌పై నేరుగా ప్రభావం ఉంటుంది. ఈ డేటాను ఉపయోగించి.. మీరు మీ రోజువారీ అలవాట్లను మెరుగుపరచుకోవచ్చు.

Also Read : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్

గ్రిప్ ఎలా ఉంటుందంటే.. 

మణికట్టు గడియారాలకు పట్టీ ఉంటుంది. కానీ టెంపుల్​కు పట్టీ ఉండదు. వాటిని మీ కణతల మీద చర్మానికి అంటించడానికి.. గ్రిప్స్ అని పిలువబడే ప్రత్యేకమైన, ఒక్కసారి మాత్రమే వాడగలిగే టేపులు అందుబాటులో ఉంటాయి. వీటిని ఒకసారి అంటించిన తర్వాత.. ఒక గ్రిప్‌ను రెండు నుంచి మూడు రోజుల పాటు సౌకర్యవంతంగా పెట్టుకోవచ్చు. ఇది చాలా చిన్నగా, పలుచగా ఉండటం వల్ల కళ్లద్దాల మీద కూడా సులభంగా పెట్టుకోవచ్చు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

కంపెనీ ప్రకారం.. దీనిని ధరించడం వల్ల మీరు మీ రోజువారీ పనులన్నింటినీ ఎలాంటి సంకోచం లేకుండా చేయవచ్చు. పరుగెత్తేటప్పుడు, జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు కూడా ఇది కదలకుండా ఉంటుంది. అయితే.. స్కూబా డైవింగ్ చేసేటప్పుడు దీనిని తీసివేయమని చెప్తున్నారు. సున్నితమైన చర్మం ఉన్నవారికి, అంటుకునే టేప్ వల్ల కొద్దిగా దురద లేదా ఎరుపుదనం అనిపిస్తే.. దానిని వెంటనే తీసివేయాల్సి ఉంటుంది.

Also Read : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే

గుర్తించుకోవాల్సిన విషయాలివే..

టెంపుల్ అధునాతన ఫీచర్లు కేవలం వ్యక్తిగత ఆరోగ్యం, ఫిట్‌నెస్, పరిశోధన కోసం మాత్రమేనని గమనించాలి. అలాగే ఇది ఒక స్మార్ట్ గాడ్జెట్. ఇది ఏ మెదడు వ్యాధికి చికిత్స చేస్తుందని గానీ, నిర్ధారిస్తుందని గానీ అర్థం కాదు. కానీ వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి దీని డేటాను వైద్యుడితో షేర్ చేసుకోవచ్చు. ఈ పరికరం మొదటి బ్యాచ్ ధర 85,000. ఇందులో యాప్‌కు లైఫ్​టైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ట్రూ గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ మిర్రర్, రియల్ జేడ్, డీప్ బ్లూ, పర్పుల్ ఫంక్ కలర్స్​లో అందుబాటులో ఉంటుంది. 

Also Read : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు ఆ తప్పులు చేయకండి.. లేదంటే క్లెయిమ్ కాదు, జాగ్రత్త