Essential Health Screenings After 30 : వయసు పెరిగే కొద్దీ శరీరంలో చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. అవి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి ఆ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చాలా వ్యాధులు వాటి ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలను చూపించకపోవచ్చు. కానీ హెల్త్ టెస్ట్​లు వాటి సంకేతాలను వెల్లడిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. 30 ఏళ్ల వయస్సు వచ్చాక ఎలాంటి టెస్ట్​లు రెగ్యులర్​గా చేయించుకుంటే మంచిదో చూసేద్దాం. 

Continues below advertisement

హై బీపీ

అధిక రక్తపోటు తరచుగా ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలను ఇవ్వదు. అందుకే మీకు తలనొప్పి లేదా ఇతర అసౌకర్యం కలిగే వరకు వెయిట్ చేయకూడదు. ముందుగానే రక్తపోటును తనిఖీ చేయించుకుంటే.. అధిక రక్తపోటును సులభంగా గుర్తించవచ్చు. 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు అధిక రక్తపోటు కోసం స్క్రీనింగ్ చేయించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మొదటి పరీక్షలోనే అధిక రక్తపోటు ఉన్నట్లు తేలితే.. వైద్యుల సూచనలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదంటే హైబీపీ ఎక్కువై.. గుండె సమస్యలు కూడా రావచ్చు.

Also Read : హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తగ్గించండి.. లేదంటే బీపీ కంట్రోల్‌ కావడం కష్టమే

Continues below advertisement

కొలెస్ట్రాల్ పరీక్ష

మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉందో లేదో టెస్ట్​ల ద్వారా మాత్రమే నిర్ధారించగలరు. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్‌కు తరచుగా ఎటువంటి లక్షణాలు స్పష్టంగా కనిపించవు. దీనిని నిర్ధారించడానికి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే మంచిది. CDC ప్రకారం.. చాలా మంది ఆరోగ్యవంతమైన పెద్దలు ప్రతి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకు ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారు లేదా కుటుంబంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు మరింత రెగ్యులర్​గా టెస్ట్​లు చేయించుకోవాలట. 

Also Read : సైలెంట్‌గా పెరుగుతున్న కొలెస్ట్రాల్.. ఈ లక్షణాలు పెరుగుతోన్న కొవ్వుకు సంకేతం, నెగ్లెక్ట్ చేయకండి

షుగర్ టెస్ట్

బ్లడ్ షుగర్ టెస్ట్ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను కొలుస్తుంది. అయితే HbA1c గత కొన్ని నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిని కొలుస్తుంది. అయితే 30 ఏళ్ల వయస్సులో ప్రతి ఒక్కరికీ డయాబెటిస్ స్క్రీనింగ్ అవసరమనుకోరు. కానీ అధిక బరువు లేదా ఊబకాయంతో ఉండి.. ఎటువంటి లక్షణాలు లేని 35 నుంచి 70 ఏళ్ల వయస్సు గల పెద్దలలో ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.

అందుకే 30 దాటిన తర్వాత డయాబెటిస్ స్క్రీనింగ్ చేయించుకోవాలని USPSTF సిఫార్సు చేస్తుంది. ఫ్యామిలీలో డయాబెటిస్ చరిత్ర లేదా ఇతర ప్రమాద కారకాలు ఉన్నట్లయితే.. వైద్యులు ముందుగానే ఈ టెస్ట్​లు చేయించుకోవాలని సిఫార్సు చేస్తారు. 

Also Read : తిన్న తర్వాత బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగకుండా ఉండాలంటే.. ఫాలో అవ్వాల్సిన అలవాట్లు ఇవే

బరువు నిర్లక్ష్యం చేయకండి..

కేవలం బరువు ఆధారంగా ఆరోగ్యాన్ని అంచనా వేయడం సరైనది కాదు. కానీ బరువు, ఎత్తు నుంచి BMIని లెక్కించవచ్చు. ఇది శరీర బరువు సాధారణ పరిధిలో ఉందో లేదో చెప్పడానికి సహాయపడుతుంది. అలాగే నడుము చుట్టుకొలతతో కూడా అంచనా వేయవచ్చు. ఎందుకంటే పొత్తికడుపు చుట్టూ ఉండే అధిక కొవ్వు అనేక ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది. మీరు వేగంగా బరువు పెరగడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా మీ శరీరంలో నిరంతర మార్పులను గమనిస్తే.. వైద్యుడిని సంప్రదించడం మంచిది. 

Also Read : పరగడుపునే వాకింగ్ చేస్తే బరువు వేగంగా తగ్గుతారా? శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచనలు ఇవే

గుర్తించుకోవాల్సిన విషయాలు

30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఈసీజీ, ఫుల్ బాడీ స్కాన్ లేదా అవసరమైన అన్ని పరీక్షలు అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వ్యక్తి వయస్సు, లక్షణాలు, ఫ్యామిలీ హిస్టరీ, ఇతర ప్రమాద కారకాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే అనవసరమైన, ఖరీదైన పరీక్షలకు బదులుగా.. మీ పరిస్థితికి అనుగుణంగా, వైద్యులు సూచించిన టెస్ట్​లు చేయించుకోవడం మంచిది. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రమాదాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.