New Renault Duster hybrid | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఎస్‌యూవీ రెనో డస్టర్ మళ్లీ ఒక కొత్త, స్టైలిస్ అవతార్‌లో మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఐకానిక్ కారు నెక్స్ట్-జనరేషన్ హైబ్రిడ్ మోడల్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రెనాల్ట్ ఈ కొత్త కారును మోడ్రన్ హైబ్రిడ్ టెక్నాలజీ, బోల్డ్ లుక్స్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో పరిచయం చేయనుంది.
కస్టమర్లు కొంతకాలం నుంచి ఈ కొత్త SUV కోసం ఎదురుచూస్తున్నారు, ఎట్టకేలకు దీని లాంచ్ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చింది. కొత్త హైబ్రిడ్ సాంకేతికతతో రాబోతున్న రెనాల్ట్ డస్టర్, తన సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కొత్త రెనో డస్టర్ హైబ్రిడ్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, ప్రత్యేక అప్‌డేట్లు రాబోతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
అక్టోబర్ 17న లాంచింగ్ కొత్త రెనో డస్టర్ హైబ్రిడ్‌ను అక్టోబర్ 17న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రెనాల్ట్ కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని తీసుకురానుంది. లాంచ్ రోజే దీని బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. ఫెస్టివల్ సీజన్‌లో ఈ కారుకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.
హైబ్రిడ్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లుకొత్త డస్టర్‌లో కస్టమర్లకు పవర్‌ఫుల్, మైలేజ్ ఫ్రెండ్లీ ఇంజిన్ ఆప్షన్లు లభించనున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణ 1.6 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే హైబ్రిడ్ సిస్టమ్. ఇది 2 ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేస్తుంది. మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లభించే అవకాశం ఉంది. ఈ కొత్త హైబ్రిడ్ సెటప్ కారుకు హై పవర్ ఇవ్వడమే కాకుండా మంచి మైలేజ్ కూడా అందిస్తుంది.
Also Read: పెట్రోల్, CNG వెర్షన్లు, 5 వేరియంట్లలో Tata Aeris లాంచ్.. ధరలు, ఆధునిక ఫీచర్లు ఇవే
రెనాల్ట్ కంపెనీ ఈ కొత్త డస్టర్ ఎక్స్‌టీరియర్‌ను గతంలో కంటే మరింత అగ్రెసివ్, మస్కులర్‌గా డిజైన్ చేసింది. ఇందులో కొత్త Y షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, సిగ్నేచర్ గ్రిల్, రూఫ్ రైల్స్, వెడల్పాటి అల్లాయ్ వీల్స్ ఇస్తున్నారు. కేబిన్‌లోకి అడుగుపెట్టగానే మీకు ఒక కొత్త, ప్రీమియం డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో 10.1 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.
అంచనా ధర
సేఫ్టీ పరంగా కొత్త రెనో డస్టర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి హైటెక్ సేఫ్టీ ఫీచర్లు ఇస్తారని అంచనాలున్నాయి. ఇక ధర విషయానికొస్తే, మేక్ ఇన్ ఇండియా, హైబ్రిడ్ టెక్నాలజీతో రానుండటం వల్ల దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షలు, రూ. 11 లక్షలు ఉండవచ్చు. టాప్ హైబ్రిడ్ వేరియంట్ల ధర రూ. 18 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Suzuki e-Access వర్సెస్ Yamaha EC-06.. రేంజ్, స్పీడ్, ధరలో ఏ బండి ఎలా ఉంది?
