High Blood Pressure Diet : హై బీపీ ఉందని తెలిసిన తర్వాత మందులతో పాటు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉప్పు, అధిక కొవ్వు, ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలను తరచుగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి బీపీ అదుపులో ఉండకుండా ఇబ్బంది కలిగించొచ్చు. అందుకే మన రోజువారీ ఆహారంలో కొన్ని ఫుడ్స్ తగ్గించడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల బీపీని కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో.. బీపీ ఉన్నవాళ్లు ఏవి తగ్గిస్తే మంచిదో చూసేద్దాం. 

Continues below advertisement

ఊరగాయలు, పచ్చళ్లు

ఆవకాయ, నిమ్మకాయ పచ్చడి, ఇతర ఊరగాయల్లో రుచి, నిల్వ కోసం ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని తరచుగా లేదా ఎక్కువ మోతాదులో తినడం వల్ల శరీరంలో సోడియం పెరిగి బీపీపై ప్రభావం చూపొచ్చు.

Also Read : పిల్లలలో లో బీపీ.. అధిక జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి

Continues below advertisement

ప్యాకేజ్డ్ స్నాక్స్

చిప్స్, మిక్చర్, ఫ్లేవర్డ్ నట్స్ వంటి ప్యాకేజ్డ్ స్నాక్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉండొచ్చు. వాటికి బదులుగా ఉప్పు తక్కువగా ఉన్న గింజలు, పండ్లు లేదా ఇంట్లో తయారు చేసిన స్నాక్స్‌ ఎంచుకోవచ్చు.

అప్పడాలు

భోజనంతో పాటు పాపడ్, అప్పడం తినడం చాలామందికి అలవాటు. కానీ వీటిలో ఉప్పు ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి హై బీపీ ఉన్నవారు వీటిని తరచుగా తీసుకోకుండా పరిమితం చేయడం మంచిది.

ఇన్‌స్టంట్ నూడుల్స్

రెండు నిమిషాల్లో తయారయ్యే నూడుల్స్ సులభమే కానీ వాటి టేస్ట్ మసాలా ప్యాకెట్లలో సోడియం ఎక్కువగా ఉండొచ్చు. అప్పుడప్పుడు తినడం కంటే కూరగాయలు, గుడ్డు వంటి వాటితో ఇంట్లో తయారు చేసుకోవడం మెరుగైన ఎంపిక.

Also Read : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే

ప్రాసెస్డ్ మీట్

ప్రాసెస్ చేసిన మాంసాహారాల్లో సోడియం, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటి బదులు తాజా చేపలు, చికెన్ వంటి వాటిని తక్కువ నూనెతో తీసుకోవచ్చు.

ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్

బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి వాటిలో ఉప్పు, కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉండొచ్చు. వీటిని తరచుగా తినడం బదులు ఇంట్లో తక్కువ ఉప్పు, తక్కువ నూనెతో తయారు చేసుకోవడం మంచిది.

బేకరీ ఫుడ్స్

కేకులు, పేస్ట్రీలు, కుకీలు, డోనట్స్ వంటి వాటిలో చక్కెరతో పాటు కొవ్వు కూడా ఎక్కువగా ఉండొచ్చు. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా బీపీ నియంత్రణకు ఇబ్బంది కలగొచ్చు.

Also Read : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు

షుగర్ డ్రింక్స్

కూల్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం బరువు పెరగడానికి దారితీయొచ్చు. కాబట్టి దాహం వేసినప్పుడు నీరు, చక్కెర లేని పానీయాలను ఎంచుకోవడం మంచిది.

రెడీ-టు-ఈట్ ఫుడ్స్

రెడీ-టు-ఈట్ కర్రీస్, ఇన్‌స్టంట్ సూప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటివి సౌకర్యంగా ఉన్నా వాటిలో సోడియం ఎక్కువగా ఉండొచ్చు. కొనేటప్పుడు ప్యాకెట్‌పై సోడియం ఎంత ఉందో చూడడం అలవాటు చేసుకోండి.

Also Read  : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

నాన్‌వెజ్ కూరలు

చికెన్, మటన్ తినడం సమస్య కాదు.. వాటిలో ఉప్పు, నూనె ఎంత ఉపయోగిస్తున్నారనేదీ ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువ ఉప్పుతో తయారు చేసే ఫ్రైలు, ప్రాసెస్డ్ నాన్‌వెజ్ ఐటమ్స్‌ను తక్కువగా తీసుకోవడం మంచిది.

హై బీపీ ఉన్నవారు ఉప్పును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ రోజువారీ సోడియం తీసుకోవడం తగ్గించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం పెద్దలు రోజుకు 2,000 mg కంటే తక్కువ సోడియం అంటే సుమారు 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. కాబట్టి కచ్చితంగా ఉప్పు అదుపులో ఉంచుకోవాలి. 

Also Read : బీపీ, షుగర్ కంట్రోల్ కావాలంటే ఏమి తినాలి? ఏవి మానాలి? డాక్టర్ ఇస్తోన్న సూచనలు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.