Teacher Student Relationships : చాలామంది పెద్దలు చిన్నప్పుడే బాగుండేది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్లకి జాబ్ చేయాల్సిన అవసరం, ఇతర పనులు చేయాల్సిన అవసరం కానీ ఉండదు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లలు మానసికంగా నలిగిపోతున్నారు. ఎన్నో విషయాలు వారిని మానసికంగా ప్రభావితం చేస్తున్నాయి. అలాంటివారి మెంటల్​ హెల్త్​ను నార్మల్ చేసే సత్తా టీచర్స్​కి ఉంటుంది. అయితే స్టూడెంట్స్​ని ఈ విషయంలో ఎలా హ్యాండిల్ చేయాలో.. పిల్లల మానసిక పరిస్థితిని డిస్టర్బ్ చేసే అంశాలు ఎలాంటివి ఉండొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం. 


పిల్లలను ప్రభావితం చేసే అంశాలివే.. 


స్టూడెంట్స్​లో చాలామందికి ఉండే మానసిక ఆందోళన ఏంటి అంటే పరీక్షలు. పేరెంట్స్​ నుంచి కూడా మార్కుల గురించిన ప్రెజర్ ఉంటుంది. కొందరు స్నేహితులు లేదా తోటి విద్యార్థులు వారిని ఏదొక కారణంతో బెదిరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో సెక్సువల్​గా వారిని ఇబ్బందులకు గురిచేసే వారుంటారు. మరికొందరికి సపోర్టివ్ పేరెంట్స్​ కూడా ఉండరు. ఇవన్నీ పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. యూనిసెఫ్​ కూడా ఈ విషయంపై ఓ నివేదిక విడుదల చేసింది. కౌమార దశలో పిల్లలు మానసిక రుగ్మతలకు గురవుతున్నారని తెలిపింది. అలాంటివారిపై ఉపాధ్యాయులు ఎలా ప్రభావం చూపిస్తారో టీచర్స్​ డే రోజు తెలుసుకుందాం. 


ఈ లక్షణాలు గుర్తిస్తే..


పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే.. వారి ప్రవర్తనలో తెలియకుండానే మార్పులు వస్తాయి. యాక్టివ్​గా ఉండేవారు సడెన్​గా డల్ అయిపోతారు. చదువులో వెనకబడిపోవడం, ఫ్రెండ్స్​తో మాట్లాడకపోవడం, ఒంటరిగా పనులు చేసుకోవడం, బాధ, భయం, కోపం, మానసికంగా క్షోభను వ్యక్తం చేస్తారు. తలనొప్పి, బరువులో మార్పులు, శరీరంలో మార్పులు ఉంటాయి. 


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. 


పిల్లల హోమ్ వర్క్​ని రెగ్యూలర్​గా చెక్ చేయాలి. వారి ప్రవర్తనలో మార్పులుంటే.. స్కూల్ కౌన్సిలర్స్, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాలి. కమ్యూనికేట్ చేయండి. పిల్లలు ఒంటరిగా వెళ్లకుండా.. ఆందోళన చెందకుండా.. వారికి హెల్ప్​ అయ్యే విధంగా వారికి తోడుగా ఎవరైనా ఉండేలా ట్రై చేయాలి. పిల్లల సమస్యలను గుర్తిస్తే దానిని అందరితో చర్చించకుండా దానికి సంబంధిత వ్యక్తులతో మాట్లాడడం మంచిది. విద్యార్థి సీక్రెట్​ని దాస్తూనే.. తెలివిగా, సున్నితంగా వారిని డీల్ చేయాలి.


నమ్మకం కలిగించాలి.. 


స్టూడెంట్స్ మీ దగ్గర సేఫ్​గా ఉంటారనే విషయం తెలిసేలా సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ఇది విద్యార్థుల మానసిక ఉల్లాసానికి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. స్టూడెంట్ టీచర్ రిలేషన్ నమ్మకాన్ని బిల్డ్ చేసేదిగా ఉండాలి. అప్పుడే వారికి ఏదైనా సమస్య ఉంటే టీచర్​ దగ్గరికే వస్తారు. వారి ఆలోచనలు మీతో పంచుకుంటారు. ఆ సమయంలో వారిని జడ్జ్ చేయకుండా వారిని ఓదార్పు ఇచ్చేలా చేస్తాయి.



ఈ తరహా పనులు పిల్లల్లో సామాజిక నైపుణ్యాలను ప్రోత్సాహించేలా చేస్తాయి. గేమ్స్ ఆడుకునేలా, వారికి నచ్చిన పనిని వారి రోటీన్​లో భాగం చేయాలి. ఈ ఇవన్నీ వారి ఆరోగ్య సమస్యలను దూరంచేసి.. మానసికంగా సంతోషంగా ఉండేలా చేస్తాయి. చదువుల్లో మంచి మార్పులు తీసుకువస్తాయి. 


Also Read : టీచర్స్​ డే స్పెషల్.. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి టీచర్స్ ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్