Summer Special Breakfast Recipes for Weight Loss : హెల్తీగా ఉండాలన్నా.. బరువు తగ్గించుకోవాలన్నా.. ఎక్కువ సమయం ఆకలితో లేకుండా.. నోటికి రుచిగా ఉండే ఫుడ్ తినాలనుకుంటే మీరు స్ప్రౌట్స్ పోహా(Sprouts Poha)ను సిద్ధం చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. సాధారణంగా స్ప్రౌట్స్ ఆరోగ్యానికి మంచివే కానీ.. రెగ్యూలర్​గా ఒకేలా తీసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. అలాంటివారు హాయిగా ఈ టేస్టీ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. ఇంతకీ ఈ టేస్టీ స్ప్రౌట్స్ పోహాను ఏ విధంగా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


అటుకులు - ఒకటిన్నర కప్పు


నూనె - 3 టేబుల్ స్పూన్లు


వేరుశెనగ గుళ్లు - 3 టేబుల్ స్పూన్లు


ఆవాలు - 1 స్పూన్ 


జీలకర్ర - 1 టీస్పూన్


ఎండు మిర్చి - 2


కరివేపాకు - 2 రెమ్మలు


ఉల్లిపాయలు - పావు కప్పు


క్యారెట్ - పావు కప్పు


పచ్చిమిర్చి - 2


క్యాప్సికమ్ - పావు కప్పు


టమోటా - పావు కప్పు


ఉప్పు - రుచికి తగినంత


పసుపు - పావు టీ స్పూన్


బఠానీలు - పావు కప్పు


మొలకలు - అరకప్పు 


పంచదార - పావు స్పూన్


నీరు - 4 టేబుల్ స్పూన్లు 


కొత్తిమీర - 1 చిన్న కట్ట 


తయారీ విధానం


ముందుగా అటుకుల్లో ఎలాంటి డస్ట్, పొడి లేకుండా చల్లుకోవాలి. ఇప్పుడు వాటిని గంజి వడకట్టుకునే గరిటలో వేసి.. నీటితో తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకులు మెత్తబడతాయి. దానిలోని నీరు కూడా కిందకి వెళ్లిపోతుంది. లేదంటే మీరు అటుకులు నీటిలో వేసి.. వాటినుంచి నీటిని వేరు చేస్తూ పిండి.. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్​, టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే మిక్స్డ్ స్ప్రౌట్స్​ను కూడా కడిగి సిద్ధం చేసుకోవాలి.


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టండి. దానిలో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు దానిలో పల్లీలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి విచ్చుకున్నంత వరకు ఉంచి.. వెంటనే వాటిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు వేసి.. అవి మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి. అనంతరం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఓ 3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు టమోటాలు వేసి ఉడికించాలి. 


కూరగాయలు ఉడికిన తర్వాత దానిలో అన్నిరకాల మొలకలను వేసి బాగా కలపాలి. ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఈ మిశ్రమంలో ముందుగా నానబెట్టిన అటుకులు వేసి బాగా కలపాలి. దానిలో కొద్దిగా పంచదార వేయాలి. ఇలా వేయడం వల్ల పోహా రుచి పెరుగుతుంది. అనంతరం ఓ నాలుగు టేబుల్ స్పూన్ల నీరు వేసి మూత పెట్టి ఉడికించాలి. నీరు వేసినా పోహా పొడిపొడిలాడుతూనే ఉంటుంది. అనంతరం ఈ పోహాను మరోసారి కలిపి.. నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర తురుము వేసుకుని.. స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ, హెల్తీ స్ప్రౌట్స్ పోహా రెడీ. 



కాస్త క్రంచీగా స్ప్రౌట్స్ ఉండాలంటే ఈ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. స్ప్రౌట్స్ ఉడికినట్లు కావాలనుకునేవారు ముందుగా స్ప్రౌట్స్ ఉడకబెట్టి ఇదే రెసిపీని ఫాలో అయిపోవచ్చు. డైట్​ చేసేవారు, షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవారు పంచదారను స్కిప్ చేయవచ్చు. ఈ హెల్తీ, టేస్టీ పోహాను పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ హాయిగా తినొచ్చు. దీనితో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. 


Also Read : సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్.. ఈ సింపుల్ స్టెప్స్​తో టేస్టీగా చేసేసుకోండి