Beetroot Brownie Recipe : పిల్లలు కేక్‌లు, బ్రౌనీలు ఇష్టంగా తింటారు. అదే బీట్రూట్, క్యారెట్లు అంటే మొహం చాటేస్తారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు కూడా స్మార్ట్‌గా మారాలి. వారు ఎలాంటి ఫుడ్స్‌ని ఇష్టపడుతున్నారో తెలుసుకుని.. ఆ ఫుడ్స్‌లో మీరు హెల్తీ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. ఉదాహారణకు మీ పిల్లలు బ్రౌనీలు ఇష్టంగా తింటే.. మీరు వారికి బీట్రూట్ బ్రౌనీలు చేయొచ్చు. ఇది వారి ఇష్టాలను హెల్తీగా చేస్తుంది. మరి ఈ బీట్రూట్ బ్రౌనీలు ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బీట్రూట్ - 2 పెద్దవి
వెజిటేబుల్ ఆయిల్ - అవసరానికి తగినంత
గోధుమ పిండి - 2 కప్పులు
కోకా పౌడర్ - 1 కప్పు
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
బేకింగ్ సోడా - అర టీస్పూన్
ఉప్పు - తగినంత
పంచదార - రుచికి తగినంత
వెనిలా ఎసెన్స్ - 1 టీస్పూన్
చాక్లెట్ చిప్స్ - 1 కప్పు
డ్రై ఫ్రూట్స్ - గార్నిష్ కోసం
తయారీ విధానం
ముందుగా బీట్రూట్ పైన తొక్కను పీల్ చేసి.. బాగా కడిగి తురుముకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. ఓ గిన్నె పెట్టి దానిలో బీట్ రూట్ వేసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లార్చాలి. అనంతరం వాటిని బ్లెండర్లో వేసి ప్యూరీ చేసుకోవాలి. కావాలంటే మీరు దానిని వడకట్టి మెత్తటి ప్యూరీని మాత్రమే ఉపయోగించుకుంటే బ్రౌనీలు బాగా వస్తాయి.
ఇప్పుడు ఓవెన్‌ను 175 డిగ్రీలు ప్రీ హీట్ చేసుకోవాలి. బ్రౌనీ పాన్ తీసుకుని దానిలో పార్చ్మెంట్ పేపర్ సెట్ చేయండి. ఇది లేకుంటే మీరు నూనె లేదా వెన్నను పాన్‌కు అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో గోధుమ పిండి, కోకాపౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని దానిలో బీట్రూట్ ప్యూరీ, పంచదార, వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. అన్నీ బాగా మిక్స్ చేయాలి. ఒకదానికొకటి కలిసేలా మిక్స్ చేసుకుంటే బ్రౌనీలు బాగా వస్తాయి.
రెండు గిన్నెలు దగ్గర పెట్టుకుని పిండిలో బీట్రూట్ మిశ్రమం వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా ఉండేలా దీనిని మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు చాక్లెట్ చిప్స్ కూడా వేసి బాగా కలపండి. దీనిని బటర్ పూసి బీటరూట్ పాన్‌లో వేయండి. చిన్నచిన్న కప్పులలో మీరు దానికి కాస్త నిండుగా కాకుండా కొంచెం వెలితిగా ఉండేలా మిశ్రమాన్ని వేయాలి. ఈ బ్రౌనీ పాన్ని ప్రీహీట్ చేసిన ఓవెన్లో జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. 30 నుంచి 35 నిమిషాలు దానిని అలా వదిలేయాలి.
బ్రౌనీలు ఉడికాయో లేదో తెలుసుకునేందుకు దానిలో టూత్ పిక్ పెట్టాలి. దానికి పిండి అంటుకోకుండా వస్తే బ్రౌనీలు సిద్ధమైనట్లు. ఒకవేళ బ్రౌనీ అంటుకుంటే మరికొంచెం సేపు దానిని బేక్ చేయాలని అర్థం. బ్రౌనీలు ఉడికిన తర్వాత పాన్‌ను బయటకు తీసి చల్లారనివ్వండి. అనంతరం ఓ ప్లేట్లో బ్రౌనీలు తీసి.. వాటిని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ బీట్రూట్ బ్రౌనీలు రెడీ.
Also Read : టేస్టీ టేస్టీ మిల్లెట్స్ పాయసం.. రెసిపీ చాలా సింపుల్