Murmura Garelu : గారెలు అంటే ఇష్టమా.. అయితే వీటిని చేసుకోవడం కష్టమని ఆలోచిస్తుంటే మీరు మరమరాల గారెలు ట్రై చేయాల్సిందే. వర్షం వస్తున్నప్పుడు క్రిస్పీగా, టేస్టీగా తినాలనిపించినప్పుడు వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​గా, ఈవెనింగ్ స్నాక్​గా కూడా వీటిని ట్రై చేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి టిప్స్ ఫాలో అయితే గారెలు రుచిగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


మరమరాలు - 3 కప్పులు


పచ్చిమిర్చి - 1 టీస్పూన్


అల్లం తురుము - 1 టీస్పూన్ 


ఉప్పు - రుచికి తగినంత 


మిరియాల పొడి - అర టీస్పూన్


జీలక్రర - 1 టీస్పూన్ 


కరివేపాకు - 1 టేబుల్ స్పూన్


బియ్యం పిండి - అర కప్పు


పెరుగు - అరకప్పు


కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు 


నూనె- డీప్ ఫ్రైకి సరిపడేంత


తయారీ విధానం


ముందుగా మరమరాలను నీటిలో వేసి కడిగి ఓ 5 నిమిషాలు నానబెట్టాలి. అనంతరం నీటిని వంపేసి.. మరమరాల్లో ఉండే నీటిని కూడా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో లేదా బ్లెండర్​లో వేసి మెత్తని పేస్ట్​గా చేసుకోవాలి. నీటిని పూర్తిగా పిండేయకపోతే.. పిండిలో నీరు ఎక్కువ అవుతుంది. కాబట్టి నీటిని పూర్తిగా పిండిన తర్వాతే మిక్సీ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఓ మిక్సింగ్​ బౌల్​లో కి తీసుకోవాలి. 


పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి.  అల్లం తురుమును సిద్ధం చేసుకోవాలి. కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర చిన్నగా తురుము చేసుకోవాలి. మిక్సింగ్​ బౌల్​లో వీటిని వేయాలి. ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. దానిలో మిరియాల పొడి, జీలకర్రను కూడా వేయాలి. వాటితో పాటు బియ్యం పిండి, అరకప్పు పెరుగు వేసుకోవాలి. అన్ని బాగా కలుపుకోవాలి. 


పిండిలో అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి కాస్త గట్టిగా లేదా డ్రైగా అనిపిస్తే కొంచెం నీరు లేదా పెరుగు వేసుకుని.. గారెలు వేసేందుకు వీలుగా పిండి ఉండేలా సెట్ చేసుకోవాలి. ఇప్పడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. డీప్ ఫ్రై చేసేందుకు సరిపడా నూనెను వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత పిండిని తీసుకుని.. గారెలు రూపంలో వత్తుకోవాలి. వాటిని నూనెలో వేయాలి.


మీడియం మంట మీద వడలు ఫ్రై చేసుకోవాలి. బంగారు రంగులో.. క్రిస్పీగా వడలు మారేలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. వేరుశనగ చట్నీతో వీటి రుచి మరింత బాగుంటుంది. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. కరకరలాడే మంచి రుచితో తక్కువ సమయంలో గారెలు వేసుకోవాలనుకున్నప్పుడు వీటి ట్రై చేసుకోవచ్చు.