2025 జూన్ 11 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 11th 2025

మేష రాశి (Aries) జూన్ 11, 2025

ఈ రోజు కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు తీసుకోండి. ఈ రోజు మీరు చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. ఇతరులతో మీ ప్రవర్తన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. సోమరితనంతో సమయాన్ని వృథా చేయడం మంచిది కాదు.  

వృషభ రాశి (Taurus) జూన్ 11, 2025

ఉద్యోగం చేస్తున్న ఈ రాశివారికి ఈ రోజు ఇంక్రిమెంట్ లభించవచ్చు. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభ ఫలితాలు పొందుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.  కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి  ఉంటుంది. సోదరులు, సోదరీమణులు పనిలో మీకు పూర్తిగా సహాయం చేస్తారు, సంబంధాలలో మాధుర్యం ఉంటుంది.

మిథున రాశి (Gemini) జూన్ 11, 2025

ఈ రాశివారు వ్యాపారంలో కొత్త సవాళ్లు ఎదుర్కొంటారు. చాలా కాలంగా ఆగిపోయిన పని ఈ రోజు పూర్తవుతుంది. సహోద్యోగుల నుంచి ఏదైనా ప్రాజెక్ట్ గురించి సలహా పొందవచ్చు...కానీ..మీ సొంత అవగాహనతో నిర్ణయం తీసుకోవాలి. మీరు మీ పనిలో స్థిరత్వాన్ని కొనసాగించాలి. కుటుంబం నుంచి పూర్తి సహకారం పొందుతారు. కర్కాటక రాశి (Cancer) జూన్ 11, 2025

మీరు ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఓ వ్యక్తి కారణంగా మీ పనికి అవసరమైన దానికన్నా ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని అలవాట్లను మెరుగుపర్చుకోవడం ద్వారా ఈ రోజు మంచి ఫలితాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే బంధం బలపడుతుంది. ఆర్థిక  పరిస్థితిపై కొంచెం శ్రద్ధ వహించాలి. మీ ఖర్చులను నియంత్రించాలి.

సింహ రాశి (Leo) జూన్ 11, 2025

అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ ఆలోచనలపై ఇతరుల ప్రభావం పడుతుంది. మీ వ్యక్తిగ విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.  మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. వైవాహిక జీవితాన్ని మెరుగుపర్చుకునేందుకు ఓ అడుగు ముందుకు వేయాలి. ఈ రాశి స్త్రీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.  కన్యా రాశి (Virgo) జూన్ 11, 2025

ఈ రాశివారు అకాస్మాత్తుగా ధనలాభం పొందుతారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. మీరు మీ పిల్లల నుంచి సహాయం పొందుతారు. ఈ రోజు మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో జరిగే సమావేశంలో మీ అభిప్రాయాలు చెప్పగలరు. ఈ రోజు మీరు కుటుంబ పని కోసం స్నేహితుల నుంచి సహాయం తీసుకుంటారు. మోడలింగ్ రంగంలో ఉన్నవారు మంచి బ్రాండ్ కోసం పని చేసే అవకాశం పొందవచ్చు.  

తులా రాశి (Libra) జూన్ 11, 2025

మీ రోజు మీకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపార కార్యకలాపాలలో పురోగతి ఉంది.  ఇంటి కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ మీరు ఏమి చేసినా, మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చేయండి.  దూరపు బంధువులను కలుస్తారు. కార్యాలయంలో మాటతీరు జాగ్రత్త. వృశ్చిక రాశి (Scorpio) జూన్ 11, 2025

జీవితంలో ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తారు. ఈ విషయం గురించి సహోద్యోగులతో కూడా చర్చిస్తారు.అందరూ మీకు మంచి ఫలితాలు వచ్చే సలహాలు చెబుతారు. పిల్లలతో సంబంధం మెరుగుపడుతుంది. కళారంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 11, 2025

వ్యాపారంలో ఉండేవారి పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. భూమికి సంబంధించిన పాత  లావాదేవీల నుంచి ఈ రోజు మీకు ప్రయోజనం కలుగుతుంది. వృత్తికి సంబంధించి ఏదైనా సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులకు కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది. 

మకర రాశి (Capricorn) జూన్ 11, 2025

ఈ రోజు మీకు ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల ఆసక్తి చూపిస్తారు. బంధువులతో ఉన్న మనస్పర్థలు ఈ రోజుతో ముగుస్తాయి. కొత్త వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. డబ్బు విషయంలో, మీరు మీ జీవిత భాగస్వామిని సంప్రదించవలసి ఉంటుంది. పెద్దల సలహా తీసుకుని పని చేయడం మంచిది.  

కుంభ రాశి (Aquarius) జూన్ 11, 2025

మీ వ్యక్తిత్వం  మెచ్చుకోలుగా ఉంటుంది. గొప్ప కీర్తిని పొందుతారు. కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన పని పూర్తవ్వడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. కాసేపు వ్యాయామం చేయండి

మీన రాశి (Pisces) జూన్ 11, 2025

ఈ రోజు మీ జీవితంలో బంగారు క్షణాలు రాబోతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. ఇంజనీరింగ్ ఉద్యోగం చేసేవారికి పదోన్నతి లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. వైవాహిక జీవితంలో పరస్పర నమ్మకం ఆధారంగా బంధం బలపడుతుంది. మీరు మీ పాత స్నేహితుడిని కలిసేందుకు ప్లాన్ చేసుకుంటారు.  

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.