Crispy and Tasty Snacks for Kids : సమ్మర్​ సెలవులు దగ్గరికి వచ్చేస్తున్నాయి. హాఫ్​ డే స్కూల్స్​ కూడా మొదలైపోయాయి. ఈ సమయంలో పిల్లలు ఇంట్లో ఉంటారు. సాయంత్ర వారికి స్నాక్​గా పెట్టాలంటే బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే కొన్ని రెసిపీలు చేసి పెట్టొచ్చు. వాటిలో చకోడీలు కూడా ఒకటి. కరకరలాడే ఈ రెసిపీలను పిల్లల నుంచి పెద్దలవరకు హాయిగా తీసుకుంటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం స్నాక్స్​గా ఛాయ్​తో పాటు వీటిని తీసుకుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. మరి చేగోడీలను ఎలా తయారు చేయాలో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు 


మైదా - 250 గ్రాములు 


నీరు - 250 మి.లీ


నెయ్యి లేదా డాల్డా - 1 టేబుల్ స్పూన్


వామ్ము - 1 టీస్పూన్


నువ్వులు - 1 టీస్పూన్


పసుపు - అర టీస్పూన్


ఉప్పు - రుచికి సరిపడేంత


తయారీ విధానం


స్టౌవ్ వెలిగించి దానిపై గిన్నెను ఉంచండి. దానిలో నీటిని వేయండి. అవి వేడి అయ్యాక.. దానిలో నెయ్యి లేదా డాల్డా వేయాలి. దీనివల్ల చెగోడీలు గుల్లగా వస్తాయి. దానిలో వామ్ము, నువ్వులు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. నీటిని పూర్తిగా మరగనివ్వాలి. బాగా మసులుతున్న సమయంలో దానిలో మైదా పిండి వేసుకోవాలి. పావు లీటర్ నీటికి పావు కేజి పిండి సరిపోతుంది. చగోడీలకు బియ్యం పిండికి బదులు మైదా పిండితో చేస్తే వాటి రుచి బాగా వస్తుంది. 


నీటిలో మైదా పిండిని వేసిన వెంటనే స్టౌవ్ ఆపేసి దానిని వెంటనే కలుపుకోవాలి. పిండి ఆరకముందే.. వేడిగా ఉన్నప్పుడే దానిని కలుపుకోవాలి. ఆ సమయంలో మీరు తడిపి పిండిన కాటన్ క్లాత్​ ఉపయోగించి పిండిని కలపవచ్చు. పిండి చల్లారిన తర్వాత కలిపితే చెగోడీలు విరిగిపోతాయి. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే పిండిని కలుపుకోవాలి. పిండిని మెత్తగా కలిపిన తర్వాత దానిని పెద్ద ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు జంతికలు వేసుకునే మేకర్​లో పెద్దగా చిల్లులు ఉండే జాలిని వేసుకోవాలి. దానిలో నెయ్యిని పూస్తే పిండి బాగా వస్తుంది.


పిండిని పొడుగుగా వేసుకుని.. వాటిని రౌండ్​గా  చెగోడీల మాదిరిగా చేసుకోవాలి. జంతికల మేకర్​ లేకపోతే చేతితోనే సన్నగా పొడుగ్గా చేసుకుని.. వాటిని చెగోడీలగా చుట్టుకోవచ్చు. వాటిని ఓ అరగంట బయట ఉంచి తర్వాత నూనెలో వేసుకోవడం వల్ల ఇవి చగోడీలు పగలవు. స్టౌవ్ వెలిగించి.. దానిపై కడాయి పెట్టండి. డీప్​ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని దానిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నూనె ఎక్కువ పీల్చుకోదు. చగోడీలు వేసుకోవాలి. అయితే ఇక్కడో ఓ పని చేయాలి. ముందుగా వేడిగా నూనెలో జాలి పెట్టి.. దానిలో చగోడీలు వేయాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిని జాలిని కడాయినుంచి తీసివేయాలి. అప్పుడు చగోడీలు అడుగున అంటుకోవు. 



ఇప్పుడు స్టౌవ్​ని కాస్త మంట ఎక్కువ చేసి 3 నిమిషాలు వేయించుకోవాలి. వాటిని తిప్పిన తర్వాత మరో మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్​ మీద వేగనివ్వాలి. చగోడీలు గోల్డెన్ కలర్​ వచ్చేవరకు వేయించుకోవాలి. అవి పూర్తిగా వేగితే.. తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే కరకరలాడే టేస్టీ చగోడీలు రెడీ. వాటిని మీరు నేరుగా తినొచ్చు. లేదా వేడి వేడి ఛాయ్​తో కలిపి తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కరకరలాడే చగోడీలు చేసేసుకోండి.


Also Read : మూడు నెలలు నిల్వ ఉండే టేస్టీ మామిడి పచ్చడి.. 5 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు