''ఇంకోసారి నా కూతురి గురించి మాట్లాడితే... ఇక్కడే పాతరేస్తా'' అని మార్కెట్ రోడ్డులో మనుషులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు రాజా రవీంద్ర. ఎందుకు? అసలు ఏమైంది? అనేది తెలియాలంటే ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త సినిమా 'సారంగదరియా' (Sarangadhariya Movie) విడుదల అయ్యే వరకు వేచి చూడాలి. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యువ హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా ఇవాళ టీజర్ (Sarangadhariya Teaser) విడుదల చేశారు.


ఇద్దరు అబ్బాయిలు... ఒక అమ్మాయి...
పిల్లలతో రాజా రవీంద్ర పడిన పాట్లు ఎన్నో!
'సారంగదరియా' సినిమాలో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయికి తండ్రిగా రాజా రవీంద్ర (Raja Ravindra) కనిపించనున్నారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర ప్రొడ్యూస్ చేస్తున్నారు. టీజర్ ఎలా ఉందనేది చూస్తే...


పెద్దబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తారు రాజా రవీంద్ర. ఆల్రెడీ అతడు ప్రేమలో ఉంటాడు. రెండో అబ్బాయి ఓ ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడతాడు. కొడుకులు ఇద్దరూ ఇలా ఉంటే... అమ్మాయికి ఆ కాలనీలో కుర్రాడు లైన్ వేస్తుంటాడు. వాళ్ల ప్రేమలు పక్కన పెడితే... ఓ మర్డర్ కేసులో రాజా రవీంద్ర ఫ్యామిలీ చిక్కుకున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమాలో చూడాలి. మధ్య తరగతి మనిషిగా, ముగ్గురు పిల్లలకు తండ్రిగా రాజా రవీంద్ర చక్కగా నటించారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.


Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!



మేలో ప్రేక్షకుల ముందుకు 'సారంగదరియా'
Sarangadhariya Movie Release: 'సారంగదరియా' చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. లెజెండ్రీ సింగర్ చిత్ర పాడిన 'అందుకోవా...' పాటతో పాటు 'నా కన్నులే...' గీతానికి వచ్చిన స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.


Also Readఅల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!



నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్‌ విడుదల చేసిన శ్రీవిష్ణు గారికి థాంక్స్. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో పాటు మంచి సాంగ్స్ ఉన్న చిత్రమిది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. మేలో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వచ్చేది చెబుతాం'' అని అన్నారు. దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ... ''దర్శకుడిగా నా మొదటి చిత్రమిది. ఓ మధ్య తరగతి కుటుంబంలో జరిగిన కొన్ని ఘర్షణలతో కూడిన కథతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీశాం. ప్రేమ, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు... అన్నీ ఉంటాయి'' అని చెప్పారు.


Also Read: ఆది సాయికుమార్ కొత్త సినిమాకు 'దిల్' రాజు క్లాప్ - బృందావనం నుంచి వచ్చిన కృష్ణుడిగా...



రాజా రవీంద్ర ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్, మోహిత్, నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంత బాబు, విజయమ్మ, హర్షవర్ధన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: వినయ్ కొట్టి, కూర్పు: రాకేష్ రెడ్డి, సంగీతం: ఎం. ఎబెనెజర్ పాల్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ స్వయంభు, పాటలు: రాంబాబు గోశాల - కడలి, నిర్మాణ సంస్థ: సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు: ఉమాదేవి - శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి.