ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం చేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళు వారానికి 150 నిమిషాలు లేదంటే కనీసం 60 నిమిషాలపాటైన శారీరక శ్రమ ఉండేలాగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈత చక్కటి మార్గం. శరీరం ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలంటే స్విమ్మింగ్ మంచి ఎంపిక. స్విమ్మింగ్ చెయ్యడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. 


శరీరం మొత్తం వ్యాయామం చేసినట్టే 


స్విమ్మింగ్ చెయ్యడం వల్ల శరీరం మొత్తం వ్యాయామం చేసినట్లవుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఒక గంట పాటు స్విమ్మింగ్ చెయ్యడం వల్ల ఖర్చయ్యే కేలరీలు సైక్లింగ్ లేదా రన్నింగ్ చెయ్యడం వల్ల ఖర్చయ్యే కేలరీలు కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి చాలా మంది స్విమ్మింగ్ చేయమని సలహా ఇస్తారు. 


అంతర్గత అవయవాల పనితీరు మెరుగుపరుస్తుంది 


స్విమ్మింగ్ చెయ్యడం వల్ల గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. రక్తపోటుని అదుపులో ఉంచడంతో పాటు ఊపిరితిత్తులు పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ఈత కొట్టడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుందని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. 


నొప్పులు తగ్గిస్తుంది 


కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు స్విమ్మింగ్ చెయ్యడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కండరాల నొప్పులు తగ్గి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు స్విమ్మింగ్ చెయ్యడం వల్ల మంచి ఫలితాలని పొందారని నిపుణులు చెబుతున్నారు. 


ఒత్తిడి తగ్గిస్తుంది, నిద్ర పట్టేలా చేస్తుంది 


స్విమ్మింగ్ చెయ్యడం వల్ల అలసట భావం వస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. కండరాలను శాంతపరిచి మెదడు చురుగ్గా ఉండేలాగా చేస్తుంది. నిద్రలేమితో బాధపడే వాళ్ళు స్విమ్మింగ్ చెయ్యడం వల్ల మనసు, శరీరం ప్రశాంతంగా ఉండటం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. 


కేలరీలు కరిగిస్తుంది  


కేలరీలను కరిగించడంలో ఈత మంచి మార్గం. మితమైన వేగంతో సుమారు గంట పాటు ఈత కొట్టడం వల్ల 715 కేలరీలు ఖర్చు అవుతాయి. 


Also Read: పరగడుపున అల్లం రసం తీసుకుంటే బోలెడు లాభాలు ఉన్నాయండోయ్


Also Read: ఈ లక్షణాలు ఉంటే మీ కాపురంలో ఏదో జరుగుతున్నట్టే! మీ పార్టనర్ ఏదో దాస్తున్నారని అర్థం!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.