ఆందోళనతో బాధపడుతున్నారా? పరిస్థితిని మరింత దిగజార్చగల ఈ అలవాట్లను మానుకోండి. యాంగ్జయిటీ అనేది దీర్ఘకాలికంగా వేధించే సమస్య. దీనికి చికిత్స తీసుకోకపోతే చాలా ప్రమాదకరంగా మారుతుంది. రోజు వారీ జీవితం కూడా దుర్భరంగా అవుతుంది. ఏ పనీ చేయలేరు, భయం పెరిగిపోతుంది, కాసేపు కూర్చొని ఆహారం కూడా తినలేరు, గుండె దడ, పొట్ట నొప్పి వంటివి వేధిస్తాయి. అందుకే యాంగ్జయిటీ వచ్చాక కచ్చితంగా వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలి. అలాగే కొన్ని రకాల అలవాట్లను మానుకోవాలి. 


నిద్రలేమి
యాంగ్జయిటీతో బాధపడుతున్నవారు కంటినిండా నిద్రపోవాలి. దీని వల్ల శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. లేకుంటే యాంగ్జయిటీ లక్షణాలు మరింత పెరిగిపోతాయి. చికాకు, కోపం, తలనొప్పి అన్నీ ఎక్కువైపోతాయి. 


కెఫీన్
కాఫీ,టీలు అధికంగా తాగే అలవాటు ఉంటే మానుకోండి. వాటిల్లో ఉండే కెఫీన్ ట్రిగ్గర్‌లా పనిచేస్తుంది. ఈ కెఫీన్ మనిషిలో వికారాన్ని, చికాకును త్వరగా కలిగిస్తుంది. ఆందోళనను పెంచుతుంది. అందుకే యాంగ్జయిటీ, ఇతర మానసిక సమస్యలతో బాధపడేవారు కాఫీని పరిమితంగా తాగడం ముఖ్యం. యాంగ్జయిటీ ఉన్న వారు కాఫీ జోలికి పోకుండా పాలతో సరిపెట్టుకుంటే మంచిది. 


అధిక పని
ఎక్కువ అలిసిపోయేలా పనిచేయడం వల్ల యాంగ్జయిటీ లక్షణాలు పెరిగిపోతాయి. అధికంగా శ్రమ పడడం కూడా ట్రిగ్గర్‌గా మారుతుంది. అలసిపోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. పని చేసే సమయాన్ని, శ్రమను తగ్గించుకోవడం ఉత్తమం. 


సోషల్ మీడియా
సోషల్ మీడియాలో గంటల కొద్దీ గడిపేవారు ఎక్కువవుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, కామెంట్లు యాంగ్జయిటీ లక్షణాలను పెంచుతాయి. ఆత్రుత ఎక్కువవుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండాలంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండడం ఉత్తమం. 


వ్యాయామ లేమి
ఏ పనీ చేయకుండా, వ్యాయామాలు లేకుండా అలా కూర్చోవడం, పడుకోవడం చేసినా కూడా లక్షణాలు అధికమవుతాయి. వాకింగ్ వంటివి రోజులో గంటైనా చేయడం ముఖ్యం. ఇంట్లో కూడా అతిగా అలిసిపోకుండా వంట, ఇల్లు సర్దుకోవడం వంటివి చేయాలి. శరీరం కదలకుండా అలా ఉండడం వల్ల ఇతర వ్యాధులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. 


Also read: ఇలా చేస్తే గుండె పోటు, మెదడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 70 శాతం తగ్గించుకోవచ్చు, ఏం చేయాలంటే




Also read: అద్భుతగుణాలున్న ఈ పుట్టగొడుగులు మద్యం అలవాటును మానిపించేస్తాయి, పరిశోధనలు సక్సెస్























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.