ఆఫీసులో హోదా, మంచి పేరును సంపాదించాల్సిన అవసరం ప్రతి ఉద్యోగికి ఉంది. ప్రవర్తనపరంగానే ఉద్యోగంలో ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అందుకే ఆఫీసులో చాలా ప్రొఫెషనల్‌గా ప్రవర్తించాలి. చేస్తున్న ఉద్యోగం పట్ల ఎంత సానుకూల ఆలోచనలు ఉంటే అంత సంతోషంగా ఉద్యోగం చేసుకోగలరు. అయితే ఆఫీసులో చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. 


కోపంగా మాట్లాడద్దు
ఆఫీసులో ఉన్నప్పుడు మీ స్నేహితులు, కుటుంబసభ్యులు నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నెమ్మదిగా మాట్లాడాలి. వారితో కోపంగా మాట్లాడడం వంటివి కార్యాలయంలో చేయకూడదు. మీ విషయాలు ఆఫీసులో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అది మంచి పద్దతి కాదు. 


నో గాసిప్స్
ఆఫీసులో చాలా రకాల వ్యక్తులు ఉంటారు.  ఎదుటి వారు ఎలాంటి పనులు చేసినా కూడా వారి గురించి వేరే వారితో మాట్లాడవద్దు. గాసిపింగ్ చేయడం వల్ల చెడ్డ పేరు మీకే వస్తుంది. మీరు మాట్లాడేదానిలో నిజం ఉన్నప్పుటికీ, వేరే వాళ్లతో ఆ విషయం మాట్లాడడం వల్ల అది గాసిపింగ్ కిందకే వస్తుంది. కాబట్టి మీకు ఎవరితోనైనా కష్టంగా అనిపిస్తే నేరుగా వెళ్లి మీ మేనేజర్‌కు చెప్పండి. లేదా ఏమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. 


సోషల్ మీడియా
సోషల్ మీడియా చూడడం మొదలుపెట్టారంటే సమయమే తెలియదు. ఆఫీసులో సోషల్ మీడియా ఖాతాలు తెరిస్తే చాలా టైమ్ వేస్టవుతుంది. అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మీ మైండ్ మొత్తం మారిపోతుంది. కాబట్టి ఉద్యోగ సమయంలో సోషల్ మీడియా ఖాతాలు తెరవకూడదు. 


అనారోగ్యంగా ఉంటే...
అన్నింటికన్నా ఆరోగ్యం ముఖ్యం. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆఫీసుకు వస్తే మీ నిబద్ధతను చూపిస్తుందనుకుంటే అది మీ భ్రమ. ఆఫీసులో అనారోగ్యకరమైన వాతావరణాన్ని, వైరస్‌ను మోసుకొచ్చినట్టు కూడా అవుతుంది. 


రాత్రి నిద్రలేకపోతే...
ముందురోజు రాత్రి మందు పార్టీలు వంటి వాటిలో పాల్గొని అర్ధరాత్రి దాటే వరకు నిద్రపోకుండా ఉంటే... మరుసటి రోజు ఆఫీసుకు సెలవు తీసుకోవడం చాలా ఉత్తమం. ముందురోజు రాత్రి మీ మైండ్ సెట్ ... మరుసటి రోజు కూడా ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగంపై ఆసక్తి చూపించలేరు. 


Also read: సెలవురోజుల్లో వచ్చే ‘హార్ట్ సిండ్రోమ్’ గురించి తెలుసా? దీని సంకేతాలు ఎలా ఉంటాయంటే










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.