Lifesaving Signs of Stroke : మెదడుకు రక్త ప్రసరణ ఆగినప్పుడు లేదా తగ్గినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. ఆక్సిజన్, పోషకాలు లేకపోవడం వల్ల మెదడు కణాలు నిమిషాల్లోనే చనిపోతాయి. ఆ సమయంలో ప్రతి సెకను కూడా విలువైనదని చెప్తారు. స్ట్రోక్ వచ్చిన సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే ఏమి చేయాలి? Stroke Golden Hour గురించిన అతి ముఖ్యమైన విషయాలు, నిపుణుల సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

స్ట్రోక్ ప్రపంచవ్యాప్తంగా చాలా మరణాలకు కారణమవుతోంది. అయితే ఇందులో ఒక ఆశాకిరణం ఉంది. అదేంటంటే.. స్ట్రోక్ లక్షణాలను సకాలంలో గుర్తించి వెంటనే చికిత్స చేస్తే.. ప్రాణాలను కాపాడవచ్చు. అలాగే వ్యక్తి సాధారణ జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి స్ట్రోక్ లక్షణాలను వెంటనే అర్థం చేసుకోవడం ముఖ్యం. దీనిని తెలుసుకోవడానికి నిపుణులు ఒక పదాన్ని ఉపయోగిస్తారు. అదే FAST. దీనిలో ప్రతి అక్షరానికి వేరే అర్థం ఉంటుంది.

ముఖంలో మార్పులు

FASTలో మొదటి అక్షరం F. F అంటే Face. ముఖం ఒకవైపుకు వంగి ఉంటే లేదా తిమ్మిరిగా అనిపిస్తే.. ఆ వ్యక్తిని నవ్వమని చెప్పి వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. మీరు కూడా ఆ మార్పు గుర్తించినా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. 

Continues below advertisement

చేతిలో మార్పులు

FASTలో రెండో అక్షరం A. A-Armని సూచిస్తుంది. స్ట్రోక్ అనే డౌట్ వచ్చినప్పుడు రెండు చేతులను పైకి లేపమని చెప్పాలి. ఒక చేయి పడిపోతే లేదా బలహీనంగా అనిపిస్తే అది స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు.

మాట తడబడితే..

FASTలో మూడో అక్షరం S. ఇది Speechని సూచిస్తుంది. కాబట్టి మీరు స్ట్రోక్ లక్షణాలు ఉన్నాయనిపిస్తోన్న వ్యక్తిని మాట్లాడమని చెప్పాలి. మాటాలు తడబడటం, మూతి వంకరగా మారడం వంటివి గుర్తిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. 

సమయం..

FASTలో చివరి అక్షరం T. ఇది సమయాన్ని సూచిస్తుంది. అంటే స్ట్రోక్ లక్షణాలను గుర్తించిన తర్వాత ఒక్క సెకను కూడా వృధా చేయకండి. వెంటనే 108 లేదా 911 కు కాల్ చేయండి.

ఇలా గుర్తించి.. స్ట్రోక్ కు సకాలంలో చికిత్స ప్రారంభిస్తే ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోవచ్చు. చికిత్స ఆలస్యం అయితే.. మెదడులోని కొన్ని భాగాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. అందుకే స్ట్రోక్ తర్వాత మొదటి కొన్ని గంటలు చాలా ముఖ్యమైనవిగా చెప్తారు. 

స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్ట్రోక్ రాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ లైఫ్​స్టైల్​లో కొన్ని అలవాట్లను చేర్చుకోవాలి. దీంతో మీరు సురక్షితంగా ఉండగలరు. ఉదాహరణకు ఉప్పు, నూనె వాడకాన్ని తగ్గించండి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినండి. ప్రతిరోజూ 30 నిమిషాలు నడవండి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటూ.. ఒత్తిడిని తగ్గించుకోండి. రక్తపోటు, షుగర్ టెస్ట్​లు రెగ్యులర్​గా చేయించుకుని.. వైద్యుల సూచనలు ఫాలో అయితే మంచిది.