Steam Vs Ice | ముఖం మీద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని ఎంత చక్కగా చూసుకుంటే మీరు అంత.. అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ముఖ్యంగా దుమ్మూ, దూళి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరిగేవారు తప్పకుండా తమ ముఖాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటికి రాగానే ముఖాన్ని శుభ్రంగా ఫేస్ వాష్ లేదా సబ్బుతో కడగాలి. సున్నితమైన క్లాత్‌తో శుభ్రం చేసుకోవాలి. అయితే, ముఖం ఎప్పటికీ నిత్య యవ్వనంగా, మృదువుగా ఉండాలంటే తప్పకుండా కొన్ని పద్ధతులు పాటించాలి. ముఖాన్ని సూర్య రశ్మి నుంచి వెలువడే UV కిరణాల నుంచి రక్షణ పొందేందుకు కొన్ని క్రీమ్‌లు ఉపయోగిస్తుండాలి. అయితే, కొందరు ముఖానికి ఆవిరి పెట్టడం, ఐస్‌తో రుద్దడం లేదా చల్లని నీటితో శుభ్రం చేయడం వంటివి చేస్తారు. మరి ముఖానికి ఆవిరి ఎక్కువ మేలు చేస్తుందా? ఐస్ మంచి చేస్తుందా? దేనివల్ల ముఖానికి ఎక్కువ మేలు జరుగుతుంది?


చల్లని నీటితో ముఖాన్ని కడగటం వల్ల కలిగే ప్రయోజనాలు: 
⦿ ముఖాన్ని చల్లని నీటితో కడగటమే ఉత్తమ మార్గం. 
⦿ చల్లటి నీరు మీ చర్మాన్ని యవ్వనంగా మార్చుతుంది. 
⦿ చల్లటి నీటితో ముఖం కడగటం వల్ల ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలు గణనీయంగా తగ్గుతాయి.
⦿ చల్లటి నీటితో ముఖాన్ని కడగడం వల్ల ముఖం డల్‌నెస్ తగ్గుతుంది. 
⦿ చల్లటి నీరు మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.
⦿ ఐస్ లేదా చల్లని నీరు చర్మానికి మరింత రక్తాన్ని పంప్ చేసి ముఖం మరింత కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
⦿ చల్లటి నీటితో ముఖాన్ని కడగడం వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. 
⦿ మీ ముఖాన్ని వేడి నీళ్లతో కడిగిన తర్వాత ఆ రంధ్రాలను మూసేయడానికి దానిపై చల్లటి నీటిని చల్లండి. 
⦿ చల్లని నీళ్లు కంటికి కూడా చాలా మంచిది.
⦿ సూర్య కిరణాల వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి చల్లని నీరు కాపాడుతుంది. 
⦿ సూర్య కిరణాల వల్ల తెరుచుకొనే రంథ్రాలను చల్లని నీరు బిగుతుగా చేస్తుంది. 


ముఖానికి ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు: 
⦿ ముఖానికి ఆవిరి పెట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి.
⦿ ఆవిరి పెట్టడం వల్ల ముఖంపై పేరుకున్న మురికిని మరింత లోతుగా క్లియర్ చేయవచ్చు.
⦿ మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను ఆవిరి తొలగిస్తుంది. 
⦿ ఇది బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్‌ను కూడా మృదువుగా చేస్తుంది. వాటిని సులభంగా వదిలించుకొనేలా చేస్తుంది.
⦿ ఆవిరి వల్ల ఏర్పడే చెమట వల్ల రక్త నాళాలు విస్తరిస్తాయి, ఫలితంగా రక్త ప్రసరణ పెరుగుతుంది.
⦿ రక్త ప్రసరణ మెరుగు కావడం వల్ల చర్మానికి ఆక్సిజన్‌ అందుతుంది. 
⦿ చర్యంపై రంధ్రాలను తెరవడం వలన మృతకణాలు, బ్యాక్టీరియా, ఇతర మలినాలు విడుదలవుతాయి.
⦿ ముఖాన్ని తేమగా ఉంచే నూనె ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆవిరి.. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
⦿ క్రీమ్‌లు, సీరమ్‌లను బాగా గ్రహించేలా చేస్తుంది. 
⦿ ఆవిరి సైనస్, దానివల్ల కలిగే తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
⦿ ఐస్ క్యూబ్‌లు రోజూ ఉపయోగిస్తే చర్మం అద్భుతంగా మారుతుంది. 
⦿ ఐస్ క్యూబ్స్ మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.


ఆవిరి వల్ల నష్టాలూ ఉన్నాయ్:
⦿ ఆవిరి సున్నితమైన చర్మాన్ని తీవ్రతరం చేస్తుంది. 
⦿ రోసేసియా లేదా తామరతో బాధపడేవారు ఆవిరి పెట్టకూడదు.
⦿ వారానికి ఒకసారి మాత్రమే ముఖానికి ఆవిరి పట్టాలి. రోజూ పెట్టకూడదు.
⦿ సాధారణ చర్మం గల వ్యక్తులు యాంటీ ఏజింగ్ లేదా ఇతర ఉత్పత్తుల నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే వెంటనే విటమిన్-సి క్రీమ్, లేదా TNS సీరమ్ వంటి ఉత్పత్తులను వర్తింపజేయాలి.  
⦿ కేవలం 10 నిమిషాలు మాత్రమే ముఖానికి ఆవిరి పెట్టాలి. 


Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు


వేడి నీటితో అస్సలు వద్దు: ముఖాన్ని వేడి నేటితో అస్సలు కడగొద్దు. వేడి నీరు మీ చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది. ఇది మీ చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. ఇది తీవ్రతరమైన చర్మ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ముఖానికి ఎప్పుడూ చల్లని నీరు, ఐస్ మాత్రమే మంచిది. 


Also Read: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?