Ghee for Weight Loss and More : నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. ఇవి హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేయడంతో పాటు.. ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా.. నెయ్యి తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ రోటీన్‌ను ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయట.
బరువు తగ్గడానికి..
నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ శరీరంలోని చెడు కొవ్వుని త్వరగా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పొట్టను కూడా తగ్గిస్తుంది. మెటబాలీజంను పెంచి.. శరీరంలోని కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మెటబాలీజం ఎంత పెరిగే.. మీరు అంత యాక్టివ్‌గా ఉంటారు. అంతే వేగంగా బరువును తగ్గించుకుంటారు.
కొలెస్ట్రాల్ దూరం..
శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంతో పాటు.. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. టాక్సిన్ల రూపంలో బయటకు పంపిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గితే గుండె సమస్యలు అదుపులో ఉంటాయి. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
జీర్ణ సమస్యలు దూరం
గట్ హెల్త్‌ని మెరుగుపరిచి.. తీసుకున్న ఆహారాన్ని, దానిలోని పోషకాలను శరీరానికి అందేలా చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారికి ఇది వండర్స్ చేస్తుందని ఆయుర్వేదం కూడా చెప్తోంది.
కీళ్లు నొప్పులు దూరం..
కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు రోజూ ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వృద్ధాప్య దశలో వచ్చే వాటిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే చలికాలంలో వచ్చే నొప్పులను తగ్గించి.. చలిని దూరం చేసి వెచ్చదనాన్ని అందిస్తుంది.
స్కిన్ హెల్త్
చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, సహజమైన మెరుపును అందించాలన్నా.. మీరు రోజూ నెయ్యిని మీ రొటీన్లో చేర్చుకోవచ్చు. ఇది స్కిన్‌కి మంచి గ్లోని అందించి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తప్రసరణను మెరుగుపరిచి.. జుట్టు, స్కిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మెదడు ఆరోగ్యానికి..
మతిమరుపు, వయసు ద్వారా పెరిగే బ్రెయిన్ ఇబ్బందులను దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తితో పాటు.. పనిపై ఫోకస్ చేసే విధంగా నెయ్యిలోని హెల్తీ ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి. పిల్లలు కూడా దీనిని రెగ్యులర్‌గా తినొచ్చు.
ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. అలాగే ఎక్కువ మోతాదులో కాకుండా స్పూన్ తింటే మంచిదని చెప్తున్నారు. మార్కెట్లో దొరికే నెయ్యి కాకుండా.. ఇంట్లోనే మీరు దానిని చేసుకుని తింటే మంచి ఫలితాలుంటాయి. మీరు ఈ రొటీన్‌ను ఫాలో అవ్వాలనుకుంటే కచ్చితంగా నిపుణులు లేదా వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.
Also Read : గుడ్లను ఇలా తింటే బరువు తగ్గొచ్చు తెలుసా? టైమింగ్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.