Daily horoscope 29th December 2024
మేష రాశి
కుటుంబానికి సమయం కేటాయించండి..వారి అభిప్రాయాలకు విలువనివ్వండి. అవసరానికి మించి ఎవరినీ నమ్మవద్దు. నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగుల నుంచి మీకు తగిన మద్దతు లభించదు. ఒత్తిడి కారణంగా, మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు
వృషభ రాశి
ఈ రోజు వైవాహిక సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది.
మిథున రాశి
ఈ రోజు మీరు కొన్ని పనుల్లో మీ మీకు మీరుగా భాగస్వాములవుతారు. ఇంటి అలంకరణ విషయంలో చాలా చురుకుగా ఉంటారు. సమాజంలో మీ పేరు పెరుగుతుంది. సంక్లిష్ట సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కర్కాటక రాశి
ఈ రోజు మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మార్కెటింగ్ సంబంధిత పనిలో గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఆస్తి వివాదాలు జరుగుతున్నట్టైతే మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!
సంహ రాశి
పిల్లల పట్ల ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద మార్పు ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వాతావరణంలో మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలను కొనసాగించండి. అవసరానికి మించి ఎవరినీ నమ్మవద్దు.
కన్యా రాశి
ఈ రోజు కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఏకాగ్రతతో పని చేయడం వల్ల పురోగతి ఉంటుంది. ఏదైనా వేడుకకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. సాంకేతిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
తులా రాశి
ఈ రోజు మీరు మీ సహోద్యోగుల కఠోర ప్రవర్తన వల్ల బాధపడవచ్చు. దంత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు శుభసమయం. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు వ్యాపారంలో అమ్మకాలు పెరగడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు అభివృద్ధి చెందుతాయి. మీ మూడ్ చాలా బాగుంటుంది. ఆటో రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీ జీవిత భాగస్వామి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే పని చేయండి. కండరాల నొప్పి ఫిర్యాదులు ఉంటాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తిచేసేందుకు ప్రయత్నించండి.
మకర రాశి
ఈ రోజు మీరు ఏకాంతంగా గడపాలి అనుకుంటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. రచనా రంగానికి సంబంధించిన వ్యక్తులు రివార్డులు అందుకుంటారు. మీ ఆలోచనలను మీ ప్రియమైనవారితో పంచుకుంటారు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు
కుంభ రాశి
ఈరోజు మీరు చేయాల్సిన పనిపట్ల నిర్లక్ష్యం వద్దు. ఏదైనా పెద్ద పని చేసే ముందు అనుభవజ్ఞుల అభిప్రాయాన్ని కచ్చితంగా తీసుకోండి. స్నేహితులకు సహాయం చేయాల్సి రావొచ్చు. కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద ఒప్పందాలను పొందవచ్చు.
మీన రాశి
ఈ రోజు మీ పని తీరు ప్రశంసలు అందుకుంటుంది. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. కొత్త పని ప్రారంభించడానికి రోజు చాలా మంచిది. మతపరమైన కార్యక్రమాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు.
Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.