పాలకూర గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. పిల్లలు, పెద్దలకు కూడా చాలా అవసరమైన పోషకాలెన్నో దాని నిండుగా ఉంటాయి. ఒక కప్పు పాలకూర సూప్ చేసుకుని వారానికోసారి తిన్నా చాలు శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు విటమిన్లు రోగనిరోధక శక్తికి, చర్మ సంరక్షణకు చాలా అవసరం. చర్మం పై ఉన్న మచ్చలు పోయి, కాంతిమంతంగా మారుతుంది. చర్మక్యాన్సర్ ను అడ్డుకునే శక్తి పాలకూరకు ఉంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గింస్తుంది. కాబట్టి హైబీపీ సమస్య ఉన్నవారు దీన్ని తరచూ తినాలి. అధిక బరువును తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. మలబధ్దకం ఉండదు. ఆకలి నియంత్రించి అమితంగా తినకుండా అడ్డుకుంటుంది. పాలకూరలో లుటీన్, జియాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాలకూరలో విటమిన్ కె లభిస్తుంది. నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పాలకూరలో ఇనుము స‌మృద్ధిగా ఉంటుంది. దీన్ని తింటే రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.

కావాల్సిన పదార్ధాలుపాలకూర తరుగు – రెండు కప్పులుబంగాళదుంప – ఒకటిక్యారెట్‌ – ఒకటిమిరియాల పొడి – టీస్పూనువెల్లుల్లి రెబ్బలు – నాలుగుఆయిల్‌ – రెండు టీస్పూన్లువెజిటేబుల్‌ స్టాక్‌ (రెడీమేడ్‌గా దొరుకుతుంది) – రెండు కప్పులుఉప్పు – రుచికి సరిపడాఉల్లిపాయ – ఒకటిపంచదార – టీస్పూను

తయారీ ఇలా...1. పాలకూర తరుగును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2. క్యారెట్, బంగాళాదుంపలను పొట్టుతీసేసి, సన్నగా తరగాలి.3. కళాయిలో నీళ్లు వేసి క్యారెట్, బంగాళాదుంప తరుగు వేసి బాగా ఉడికించాలి. 4. ఉడికిన తరుగును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వేడినీటిలో పాలకూర ఆకులు వేసి ఉడికించాలి. 5. పాలకూర మెత్తగా ఉడికాక చల్లరనివ్వాలి. 6. క్యారెట్, బంగాళాదుంపలు, పాలకూర కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. 7. అందులో వెజిటబుల్ స్టాక్ కూడా వేసి కలపాలి. 8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. 9. అవి వేగాక పాలకూర, క్యారెట్, బంగాళదుంప మిశ్రమం, మిరియాల పొడి వేసి వేయించాలి. 10.  రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. 

వేడివేడి సూప్‌ను సర్వ్ చేయాలి. చల్లని సాయంకాలం ఈ సూప్ తింటే భలే రుచిగా ఉంటుంది. 

Also Read: గోనెసంచి నిండా కాయిన్స్ ఇచ్చి స్కూటర్ కొన్నాడు, వీడియో చూడండి

Also Read: ఈ తీగ పేరేంటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా దాని ఆకులు తినాల్సిందే