జీవితంలో తట్టుకోలేని బాధల్లో ఒకటి ఆకలి. ఇప్పుడు మనమంతా కష్టపడుతోంది ఆ ఆకలి తీర్చుకోవడం కోసమే. అందుకే, కాబోలు ఆ యువకుడు.. ఆ ఖరీదైనా అరటి పండును అమాంతంగా తినేశాడు. అక్కడి సందర్శకులను అవ్వక్కయ్యేలా చేశాడు. ఇంతకీ ఆ అరటి పండుకు ఎందుకంత విలువ అనేగా మీ సందేహం. అయితే.. చదవండి.


ఆకలిగా ఉన్నపుడు మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారట. ఆకలి మెదడుకెక్కితే విచక్షణ కోల్పోతారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఆకలి ఎక్కువైతే కోపం కూడా వస్తుందట. ఇలా ఆకలి వల్ల కలిగే విసుగు, కోపాన్ని తెలియజేసేందుకు  ‘హాంగ్రీ’ అని కొత్త పదం కూడా వాడుకలోకి వచ్చింది. అదే హంగ్రీ, ఆంగ్రీల మధ్యస్థంగా ఉండే హాంగ్రీ. ఆకలితో ఉన్న ఒక విద్యార్థి కోటి రూపాలయ విలువైన ఆర్ట్ పీస్ ను తీనేశాడట. ఈ మధ్య ఈ విషయం సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది.


దక్షిణ కొరియాలోని లీయం మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో మౌరిజియో కాటేలాన్ తన ఆర్ట్ వర్క్ ను ‘WE’లో భాగంగా  బనానా డక్ట్ వర్క్ ను గోడకు టేప్ తో అమర్చి ప్రదర్శనకు పెట్టారు. దీని విలువ దాదాపు కోటి రూపాయలట. ఎందుకంటే.. దాన్ని అక్కడ అతికించిన ఆర్టిస్టు క్రియేటివ్‌కు ఇచ్చే విలువ అలాంటిదట. అంతా ఒకే.. మరి ఆ అరటి పండును ఎవరైనో తినేస్తానో? ఈ చిలిపి ఆలోచన.. అక్కడ సందర్శనకు వచ్చిన విద్యార్థికి కూడా వచ్చినట్లుంది. అదేదో అతడి కోసమే అతికించాడు అన్నట్లుగా టేపు పీకేసి.. అరటి పండును తినేశాడు.


పాపం, అది తిన్న తర్వాత అతడికి తెలిసిందట. ఆ అరటిపండు విలువ అక్షరాలా.. 1 లక్షా 20 వేల డాలర్లు అని. ఇండియన్ కరెన్సీలో దాదాపుగా కోటి రూపాయాల విలువ చేస్తుందట. అతడు ఆ అరటిపండును అలా తినేయడం చూసి.. ‘‘అరే ఎంట్రా ఇది.. అరటిపండును అలా తినేశావ్’’ అన్నారట. 


ఈ ఘనకార్యం చేసిన ఆ విద్యార్థి పేరు నోహ్ హూయిన్సూ. అతడు ఉదయాన్నే బ్రేక్ పాస్ట్ చెయ్యకుండా ఈ ప్రదర్శన చూసేందుకు రావడం వల్ల అరటిపండును చూసిన ఆ క్షణంలో ఆకలికి తాళలేక దాన్ని తినేయాలనే ఆలోచన కలిగిందట. ఆ క్రమంలో ఆ అరటి పండును ప్రదర్శనలో పెట్టిన ఆర్ట్ వర్క్ అనే విషయాన్ని కూడా పట్టించుకోలేదట. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.






ఈ వీడియోలో ఆ స్టూడెంట్ ఆ ఆర్ట్ వర్క్ వద్దకు నడుస్తూ వెళ్లి, గోడకు అతికించి ఉన్న అరటిపండు చూశాడు. దాని టేపును తొలగించి.. అరటి పండు తీసుకున్నాడు. అతడిని వారించే లోపే పండు తినేశాడు. ఆ తర్వాత తొక్కను అదే డక్ట్ టేప్‌తో గోడకు అతికించి వెళ్లిపోయాడు. దీంతో అతడు ఆకలితో చేసిన పని కాదని, కావాలనే అలా చేసి ఉంటాడని అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజనులు రకరకాల కామెంట్లు పెడుతున్నాడు. అతడు అతికించిన ఆ తొక్కకు మరింత విలువ పెరిగి ఉండవచ్చని, ఏ కళాకారుడికి రానంత గొప్ప ఆలోచన ఆ స్టూడెంట్‌కు వచ్చిందని అంటున్నారు. ఇంతకీ ట్విస్ట్ ఏమిటంటే.. ఎందుకు ఆ అరటి పండు తిన్నావంటే.. ‘‘అది తినడానికి అక్కడ పెట్టలేదా?’’ అని అమాయకంగా అడిగాడట. ఆ తర్వాత తొక్క కూడా బాగానే ఉందిగా, దాన్ని కూడా కళాత్మక దృష్టితో చూడండి అన్నాడట. అయితే, ఈ ఘటన 2019లో జరిగినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో మళ్లీ దాన్ని వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.






Also Read: రోజుకొక తమలపాకు నమిలితే ఆ రోగాలేవీ మీ దరిచేరవు