Social Media Money Making Tips : నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఓ వ్యసనంగా మారిపోయింది. చాలామంది దానిలో గంటల కొద్ది సమయాన్ని గడుపుతున్నారు. అయితే దీనిని కేవలం టైమ్​పాస్​కే కాదు.. డబ్బు సంపాదించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. Facebook, Instagram, YouTube లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి.. ఇంట్లోనే కూర్చుని డబ్బు సంపాదించవచ్చు. పర్​ఫెక్ట్ ప్లాన్, కాస్త కృషి, సహనం ఉంటే చాలు. సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. దానికోసం ఫాలో అవ్వాల్సిన సులభమైన మార్గాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement


కంటెంట్ క్రియేటర్


మీకు ఫ్యాషన్, ఫిట్‌నెస్, ట్రావెల్, టెక్నాలజీ, వంట లేదా గేమింగ్ వంటి నిర్దిష్ట అంశాలపై ఆసక్తి ఉంటే.. మీరు ఈజీగా కంటెంట్ క్రియేటర్ అయిపోవచ్చు. ఆసక్తి కలిగిన అంశాలపై మీరు వీడియోలు లేదా పోస్ట్‌లు వేయవచ్చు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయాలి. వ్యూయర్స్ పెరిగేకొద్దీ, బ్రాండ్‌లు మిమ్మల్ని సంప్రదిస్తాయి. Instagram రీల్స్, YouTube షార్ట్‌లు, Facebook వీడియోల నుంచి కూడా మంచి ఆదాయం పొందవచ్చు.


మార్కెటింగ్


అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు ఏదైనా కంపెనీ ఉత్పత్తులు లేదా సేవల గురించి ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదించే మార్గం. ఎవరైనా మీ లింక్ ద్వారా ఆ ప్రొడెక్ట్ కొనుగోలు చేయడం లేదా సేవలను ఉపయోగించుకోవడం వల్ల మీకు కమీషన్ అందుతుంది. Amazon, Flipkart, Meesho వంటి కంపెనీలు అనుబంధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. మీరు చేయాల్సిందల్లా మీ సోషల్ మీడియాలో వారి లింక్‌లను షేర్ చేసి ప్రమోట్ చేయడమే.


స్పాన్సర్‌షిప్


మీ సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెరిగితే.. పలు బ్రాండ్‌లు మిమ్మల్ని సంప్రదిస్తాయి. వారు తమ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మీకు డబ్బు చెల్లిస్తారు. ఇది Instagram ఇన్​ఫ్లూయెన్సర్లు, YouTube క్రియేటర్లు, Facebook పేజీ యజమానులకు అందుబాటులో ఉంటుంది. 


YouTube మానిటైజేషన్


మీ YouTube ఛానెల్‌లో 1000 మంది సబ్‌స్క్రైబర్‌లు, 4000 గంటల వాచ్ టైమ్ ఉంటే.. మీకు YouTube భాగస్వామి ప్రోగ్రామ్ ద్వారా వీడియోలలో ప్రకటనలు వస్తాయి. వీటిని ప్రదర్శించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అంతేకాకుండా సూపర్ చాట్, ఛానెల్ లైసెన్స్, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.


ఆన్‌లైన్ కోర్సులు 


మీరు గ్రాఫిక్ డిజైన్, కోడింగ్, వ్యక్తిగత అభివృద్ధి లేదా భాషా వంటి ఏదైనా విషయంలో నిపుణులైతే.. మీరు ఆన్‌లైన్ కోర్సులను తయారు చేసి సోషల్ మీడియా ద్వారా అమ్ముకోవచ్చు. అదనంగా ఇ-పుస్తకాలు, ప్రింటబుల్స్, టెంప్లేట్‌ల వంటి డిజిటల్ వస్తువులు కూడా మంచి ఆదాయాన్ని అందించగలవు.


మీరు క్రియేట్ చేసే కంటెంట్ బట్టి మీకు వచ్చే ఫాలోవర్ల బట్టి మీ ఆదాయం డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇది ఒక్కరోజులో జరిగిపోయేది కాదు. కాస్త సహనం అవసరం. కొన్ని సందర్భాల్లో ఓవర్​నైట్​లో స్టార్ అయిపోవచ్చు. మరికొన్ని సార్లు ఎక్కువ సమయం పడుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే.. మీరు నిలదక్కుకునేవరకు దీనిని సెకండ్ ఇన్​కమ్ సోర్స్​గానే చూడాలి. మీకు కావాల్సినంత ఆదాయం వస్తున్నప్పుడు మీరు పూర్తిగా దీనిపై శ్రద్ధ పెట్టవచ్చు.