మేకప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సినిమా నటీనటులే. నిజానికి ఆధునిక కాలంలో కేవలం వారే కాదు ఎంతో మంది మేకప్ వేసుకుంటున్నారు. కాంపాక్ట్ పౌడర్ తో మొదలుపెట్టి ఐలేషెస్ వరకు చాలా మంది మేకప్ ఫాలోఅవుతున్నారు. కొంతమంది అర్థరాత్రి దాటాకా ఇంటికి చేరినప్పుడు అలసిపోయి అలాగే నిద్రపోతారు. కానీ అలా చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మీ చర్మాన్ని మీరే చేజేతులా పాడుచేసుకున్నవారు అవుతారు. దీర్ఘకాలంగా మేకప్ చర్మంపైనే ఉండడం వల్ల చాలా హాని కలుగుతుంది. 


ఏ సమయానికైనా నిద్రపోయే ముందు మేకప్ తొలగించడం చాలా ముఖ్యం. లేకుంటే అది చర్మం రంధ్రాలను మూసేస్తుంది. రంధ్రాలు ఎక్కువ కాలం పాటూ మూసుకుపోయినప్పుడు ఇది మొటిమలకు దారితీస్తుంది. చర్మాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఇతర చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఎదురయ్యే సమస్యలు ఇవే. 


మొటిమలు
ముందుగా చెప్పినట్టు మేకప్ తీయకుండా పడుకోవడం వల్ల కచ్చితంగా మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాదు ముఖంలో జిడ్డుదనం పెరిగిపోతుంది. దురద ఎక్కువైపోతుంది. కాబట్టి పడుకునేముందు కచ్చితంగా మేకప్ మొత్తం క్లీన్ చేసకుని చర్మ రంధ్రాలు తమ పని తాము చేసే అవకాశాన్ని కల్పించండి. 


దురదలు
ఎక్కువ సేపు మేకప్ ముఖంపై ఉండడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. ఇది దురదకు దారితీయవచ్చు. ఆ దురదలను గోకడం వల్ల గోళ్లలోని దుమ్ముధూళి కూడా చర్మ రంధ్రాల్లోకి చేరవచ్చు. ఎర్రటి పాచెస్ లా వచ్చి ఇతర చర్మవ్యాధులు దాడి చేయవచ్చు. 


కళ్లకు ఇరిటేషన్
మేకప్‌ తీయకుండా నిద్రపోవడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి చాలా హాని. ఆ చర్మం శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. కళ్ల చుట్టూ ఉండే ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ ప్రాంతం దెబ్బతింటే ముఖమంతా అందవికారంగా కనిపిస్తుంది. కాబట్టి మేకప్ విషయంలో జాగ్రత్త పడండి. 


పెదవులు
లిప్ స్టిక్ ను వాడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. రోజులో రెండు మూడు గంటలకోసారి లిప్ స్టిక్ రుద్దేవారు ఎంతో మంది. పడుకునే ముందు మాత్రం పెదవులను శుభ్రం చేసుకుని, లిప్ స్టిక్ మొత్తం తొలగించాకే నిద్రపోవాలి. లేకుంటే పెదవులు పొడిగా మారిపోతాయి. పగుళ్లు ఏర్పడతాయి. పెదవుల్లోని తేమను మొత్తం లిప్ స్టిక్ పీల్చేస్తుంది. దీనివల్ల పెదవులు పాలిపోయినట్టు మారిపోతాయి. 


Also read: డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన నాలుగు కూరగాయలు ఇవే


Also read: భూమ్మీద ఇప్పటివరకు పుట్టినవాళ్లలో అత్యంత ధనవంతుడు ఈయనే, పనివారికి కూడా బంగారు వస్త్రాలే




















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.