ఆరుగురు అక్క చెల్లెళ్లు ఒకేసారి పెళ్లీడుకు వచ్చారు. వారి పెళ్లికి ఆ ఇల్లే కాదు, ఆ గ్రామమే సందడిగా మారిపోయింది.  రాజస్థాన్లోని చిరాని గ్రామంలో నివసిస్తోంది రోహితష్వ్ గుర్జర్. అతనికి ఎనిమిది మంది పిల్లలు. వారిలో ఏడుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. గుర్జర్ కు ఆడపిల్లలైనా, మగపిల్లలైనా సమానమే. అందుకే తనకు వీలైనంతవరకు వాళ్లని చదివించారు. ఆరుగురు అమ్మాయిలు ఎమ్మే బీఎడ్ పూర్తిచేసారు. ఒక అమ్మాయి ఇంకా డిగ్రీ చదువుతోంది. కొడుకు కూడా బాగానే చదివాడు. ఇక ఆరుగురు ఆడపిల్లలు ఏడాది తేడాతో పుట్టినవారే. దీంతో వారందరికీ ఒకేసారి పెళ్లిళ్లు చేయాలని నిశ్చయించారు. 


ఆరుగురు ఆడపిల్లలను మూడు ఊళ్లకు కోడళ్లుగా పంపించారు. ప్రతి ఇద్దరు ఆడపిల్లలు ఒకే ఇంటికి తోటికోడళ్లుగా వెళ్లారు. ఆ ఆడపిల్లల పేర్లు మీనా, సీమ, అంజు, నిక్కి, యోగితా, సంగీతా. అందరికన్నా చిన్న అమ్మాయి క్రిపా. ఈమె ఇంకా డిగ్రీ చదువుతోంది. అందుకే చదువులు పూర్తయిన ఆడపిల్లలందరికీ పెళ్లిళ్లు కుదిర్చారు.  మీనా, సీమా ఒకే ఇంటి అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు. అంజూ, నిక్కి  మరో గ్రామానికి చెందిన ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. యోగితా, సంగీతా కుఠానియా గ్రామానికి చెందిన ప్రదీప్, మోహిత్ అనే అన్నదమ్ములను పెళ్లాడారు. 


వారి ఆరుగురి పెళ్లికి, వారి ఇల్లే కాదు గ్రామమంతా ముస్తాబైపోయింది. ఆరుగురి పెళ్లంటే ఎంత హడావుడి. పెద్ద వేదికపై ఆరు జంటలకు అంగరంగవైభవంగా పెళ్లి చేశారు. ఆ పెళ్లికి ఊరంతా కదిలి వచ్చింది. ఒక్కగానొక్క సోదరుడు అక్కల పెళ్లిని దగ్గరుండి జరిపించాడు. ఒకే వేదికపై కూతుళ్ల పెళ్లిళ్లు చూసి సంతోష పడ్డారు తల్లిదండ్రులు. పెళ్లి జంటలు డ్యాన్సులతో వేదికపై ఇరగదీశారు. వారి డ్యాన్సులు చూసిన గ్రామస్థులు కూడా స్టెప్పులేశారు. 


Read Also: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా


Read Also: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త



Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి