క మంచి పుస్తకాన్ని ఎంత ధర పెట్టైనా కొనేయొచ్చు. ఒక వేళ అది ఎవరైనా గొప్ప వ్యక్తి రాసిన పుస్తకమైతే.. ఎంతైనా చెల్లించి సొంతం చేసుకోవచ్చు. అయితే, అమెరికాలో ఓ కామిక్ పుస్తకంలోని సింగిల్ పేజీ రూ.24 కోట్లు విలువ పలికిందంటే మీరు నమ్ముతారా? కానీ, నమ్మి తీరాల్సిందే. పుస్తకంలోని సింగిల్ పేజీని ఎలా అమ్మేస్తారు? అలా చేస్తే పుస్తకంలోని మిగతా పేజీలు వేస్ట్ అవుతాయి కదా? ఒక పేజీయే అంత ధర ఉంటే.. మొత్తం పుస్తకం ఎంత ధర పలుకుతుందో అనేగా మీ సందేహం? 


అమెరికా వంటి దేశాల్లో కామిక్ బుక్స్‌కు ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా ‘స్పైడర్ మ్యాన్’ పుస్తకాలకు మాంచి డిమాండ్ ఉంది. అలాగే మార్వెల్(Marvel) సంస్థకు చెందిన ‘సీక్రెట్ వార్స్ నెం.8’ (Secret Wars No 8)కు ప్రత్యేకత ఉంది. 1984 సంవత్సరం నాటి ఈ పుస్తకంలోని 25వ పేజీలో స్పైడర్ మ్యాన్ తొలిసారి నల్ల సూట్‌లో కనిపిస్తాడు. ఇది ‘వెనమ్’(Venom) పాత్ర అప్పుడే ఆవిర్భవించింది. దీంతో ఆ పేజీకి ఎక్కడాలేని ప్రాధాన్యం లభించింది. ఆ సింగిల్ పేజీ ఆర్ట్ వర్క్‌ను నిర్వాహకులు ఇటీవల వేలం వేశారు. అది 3.36 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.24 కోట్లు) ధర పలికింది. కానీ, ఒక పేజీని అంత ధర పెట్టి కొనడమంటే మాటలు కాదు. సంపన్నులు తమ స్టేటస్ ఇలాంటి ఆర్ట్‌వర్క్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు.






Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!


Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి