Protect Your Heart During Summer : వేసవిలో అధిక వేడి, ఉక్కపోతల కారణంగా చాలామందిలో గుండెకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. హార్ట్ ఎటాక్, హీట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు ప్రాణాలు హరిస్తాయి. అందుకే ఎండకాలంలో గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు. లైఫ్​స్టైల్లో చిన్న మార్పులు చేస్తూ.. గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చంటున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటి? ఎలా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలో చూసేద్దాం. 

Continues below advertisement

గ్లాసు గోరువెచ్చని నీరు.. 

మీ ఉదయాన్ని ఒక చిన్న అలవాటుతో ప్రారంభించండి. కేవలం ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగి.. ఐదు నిమిషాల పాటు శరీరాన్ని స్ట్రెచ్ చేస్తే చాలామంచిది. మార్నింగ్ కాఫీ కంటే ఇది చాలా మంచిది. ఇంట్లో లేదా బయట కాసేపు నడవడం వల్ల మీ రక్త ప్రసరణ పెరిగి.. హెల్తీ డేను ప్రారంభించవచ్చు. 

తేలికపాటి భోజనం.. 

బాగా వేయించిన ఆహారాలకు బదులుగా.. మీ భోజనంలో సగం కూరగాయలు లేదా పండ్లతో నింపుకోండి. కొన్ని మిల్లెట్స్ డైట్​లో చేర్చుకోండి. పప్పుధాన్యాల తీసుకోవాలి. ప్యాక్ చేసిన వాటికి బదులుగా ఇంట్లో తయారుచేసిన స్నాక్స్ తీసుకుంటే మంచిది. చిన్న చిన్న మార్పులు కాలక్రమేణా మీ ఆరోగ్యంపై చాలా మంచి ప్రభావం చూపిస్తాయి. 

Continues below advertisement

ఒత్తిడి తగ్గించుకోండి.. 

ఒత్తిడి అనేది ఎప్పుడూ బయటకు కనిపించకపోవచ్చు. కానీ.. గుండె దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు డీప్​ బ్రీత్​లు తీసుకోవడం చాలా ముఖ్యం. మీలోపలి ఫీలింగ్స్ పేపర్​ మీద రాస్తే ఆలోచనలు తగ్గుతాయి. అలాగే రోజూ పది నిమిషాలు ధ్యానం చేస్తే.. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు కూడా రక్తపోటు, మానసిక స్థితిని అదుపులోకి తీసుకొస్తాయి.

నిద్ర విషయంలో నో రాజీ.. 

ఐదు లేదా ఆరు గంటల నిద్రతో బతకొచ్చు అనుకుంటారు. కానీ మీ గుండెకు తగినంత విశ్రాంతి అవసరమని గుర్తించండి. క్రమం తప్పకుండా 7–8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్రపోయే ముందు స్క్రీన్‌లను ముందుగానే ఆపివేయడం వంటివి కూడా మీ గుండెను బలంగా ఉంచడంలో పెద్ద మార్పును తీసుకురాగలవు. నిద్ర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోండి. 

వ్యాయామం.. 

వ్యాయామం అంటే కేవలం జిమ్‌కు వెళ్లడం మాత్రమే కాదు. డ్యాన్స్ చేయడం, మీ పెట్​ను వాకింగ్​కి తీసుకెళ్లడం, ఇంట్లోనే శరీరాన్ని స్ట్రెచ్ చేయడం, యోగా వంటివి కూడా వ్యాయామం కిందకే వస్తాయి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీ బరువును అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండెకు హానీ కలిగించే అలవాట్లు.. 

గుండెకు హాని కలిగించే అలవాట్లను తగ్గించుకోవాలి. సిగరెట్లు, కాఫీ అధికంగా తీసుకోవడం లేదా మద్యం వంటివి మీ గుండెపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. అయితే వీటిని మీరు రాత్రికి రాత్రే మానేయాల్సిన అవసరం లేదు. కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగడం లేదా స్మోక్ చేయడాన్ని నెమ్మదిగా తగ్గించుకోవడం వంటి చిన్న మార్పులు.. వారాల వ్యవధిలో స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతాయి.

హైడ్రేషన్.. 

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని చిక్కగా చేసి.. గుండెపై అధిక భారాన్ని మోపుతుంది. కాబట్టి మీరు బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా మీతో ఓ బాటిల్‌ తీసుకెళ్లండి. ఇది హీట్ స్ట్రోక్ సమయంలో కూడా హెల్ప్ అవుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుంచి 9 గ్లాసుల నీరు తాగండి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.